Marnus Labuschagne : నీ కక్కుర్తి తగలేయా.. ఇదేం పనీ.. వీడియో వైరల్
లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ చేసిన పని కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

Marnus Labuschagne bizarre act
Marnus Labuschagne bizarre act : యాషెస్ సిరీస్ (Ashes)లో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లాండ్ (England) జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు ఆసక్తికరంగా సాగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ (Marnus Labuschagne) చేసిన పని కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటీజన్లు అతడు చేసిన పనికి అసహ్యించుకుంటున్నారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?
సాధారణంగా క్రికెటర్లు మ్యాచ్ ఆడుతున్న సమయంలో చుయింగమ్ వంటి వాటిని నములుతుండడాన్ని చూసే ఉంటాం. ఇక లబుషేన్‌కు కూడా ఆ అలవాటు ఉంది. అతడు మైదానంలో ఉన్నాడంటే నోటిలో చుయింగమ్ ఉండాల్సిందే. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 45వ ఓవర్ కు ముందు అతడు బ్యాటింగ్ చేసేందుకు గ్లోవ్స్‌తో పాటు హెల్మెట్ పెట్టుకునే క్రమంలో చుయింగమ్ కిందపడింది. దాన్ని అలాగే వదిలివేయకుండా వెంటనే దాన్ని తీసుకుని నోటీలో వేసుకున్నాడు.
Marnus dropping his gum on the pitch and then putting it back in his mouth????pic.twitter.com/tGdYqM3w72
— ?Stu ?? (@stuwhy) June 29, 2023
ఇది మొత్తం కెమెరాల్లో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. మట్టి అంటినా పట్టించుకోకుండా తినడం పై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. నీ కక్కుర్తి తగలేయా అంటూ కొందరు కామెంట్లు పెడుతుండగా మరికొందరు మాత్రం అతడు దేన్ని వేస్ట్ చేయడు అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లబుషేన్ 47 పరుగులు చేశాడు.
Ashes : ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్పిన్నర్ నాథన్ లైయన్‌కు గాయం.. ఆడడం కష్టమే..!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. స్టీవ్ స్మిత్ (110) సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 325 చేసింది. దీంతో ఆసీస్‌కు 91 పరుగుల ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది.