MLC T20 : కేకేఆర్‌కు ఘోర పరాభవం.. ఆండ్రీ రస్సెల్, గుప్టిల్, నరైన్ ఉన్నా.. 50 కే ఆలౌట్.. 105 పరుగులతో ముంబై గెలుపు
కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) కు మేజర్ లీగ్ క్రికెట్లో ఘోర పరాభవం ఎదురైంది. 156 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు చెందిన లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ (Los Angeles Knight Riders)50 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
MLC T20 MI New York VS LA Knight Riders : కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) కు మేజర్ లీగ్ క్రికెట్లో ఘోర పరాభవం ఎదురైంది. 156 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు చెందిన లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ (Los Angeles Knight Riders)50 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఏకంగా 105 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. మార్టిన్ గుప్టిల్, ఆండ్రీ రస్సెల్, రిలీ రొసో, సునీల్ నరైన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నా కనీస పోటీని ఇవ్వలేకపోయింది. టీ20 లీగ్ చరిత్రలోనే కేకేఆర్ ఫ్రాంచైజీకి ఇదికి ఘోర పరాజయం.
Virat Kohli : ధోని ని అధిగమించిన కోహ్లి.. సచిన్ రికార్డు పై కన్ను.. మరో మైలురాయికి చేరువ
మేజర్ లీగ్ క్రికెట్లో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్టును కొనుగోలు చేయగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ న్యూయార్క్(MI New York )ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో టిమ్ డేవిడ్ (48 నాటౌట్; 21 బంతుల్లో 4 పోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా నికోలస్ పూరన్ (38; 37 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. నైట్ రైడర్స్ బౌలర్లలో అలిఖాన్, ఆడమ్ జంపా, కోర్న్ డ్రైలు తలా రెండు వికెట్లు పడగొట్టగా లాకీ ఫెర్గూసన్ ఓ వికెట్ తీశాడు.
Rohit Sharma : అతడి కోసం ఇన్నింగ్స్ డిక్లేర్ ఆలస్యం.. ఇంతకీ ఎవరా ప్లేయర్ అంటే..?
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ 13.5 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. నైట్ రైడర్స్ బ్యాటర్లలో ఉన్ముక్త్ చంద్(26) మినహా మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. గుప్టిల్, నితీశ్ కుమార్, కార్న్ డ్రై, లాకీ ఫెర్గూసన్‌లు డకౌట్లు కాగా.. ఆండ్రీ రస్సెల్ (2), సునీల్ నరైన్(2), రిలీ రొసో (2) ఘోరంగా విఫలం అయ్యారు. న్యూయర్క్ బౌలర్లలో నోస్తుష్ కెంజిగే, ట్రెంట్ బౌల్ట్, రబాడ, అదిల్, పొలార్డ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా.. ఈ సీజన్లో నైట్‌రైడర్స్‌కు ఇరు వరుసగా రెండో ఓటమి.
Wimbledon 2023: వింబుల్డన్ విజేత అల్కరాజ్.. మీడియా ముందు కంటతడి పెట్టిన జొకోవిచ్