AUS vs SL : అరె ఏంట్రా ఇది.. బంగారం లాంటి అవ‌కాశం వ‌దిలేశావ్‌..! క్రీడా స్పూర్తి..!

క్రికెట్ లో క్రీడాస్పూర్తి పై అప్పుడప్పుడు చ‌ర్చ జ‌రుగుతుంటుంది. ఇటీవ‌ల కాలంలో మ‌న్క‌డింగ్ (ర‌నౌట్) విష‌యంలో ఇది ఎక్కువ‌గా జ‌రుగుతోంది.

AUS vs SL : అరె ఏంట్రా ఇది.. బంగారం లాంటి అవ‌కాశం వ‌దిలేశావ్‌..! క్రీడా స్పూర్తి..!

Mitchell Starc refuses Mankad

World Cup 2023 AUS vs SL : క్రికెట్ లో క్రీడాస్పూర్తి పై అప్పుడప్పుడు చ‌ర్చ జ‌రుగుతుంటుంది. ఇటీవ‌ల కాలంలో మ‌న్క‌డింగ్ (ర‌నౌట్) విష‌యంలో ఇది ఎక్కువ‌గా జ‌రుగుతోంది. ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇది త‌ప్పు కాన‌ప్ప‌టికీ కొంద‌రు దీన్ని త‌ప్పుబ‌డుతుంటారు. మ‌రికొంద‌రు మాత్రం మ‌ద్ద‌తు ఇస్తుంటారు. వ‌న్డే ప్ర‌పంచ‌కప్‌లో భాగంగా ల‌క్నో వేదిక‌గా ఆస్ట్రేలియా, శ్రీలంక జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో లంక బ్యాట‌ర్‌ను మన్క‌డింగ్ చేసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ మిచెల్ స్టార్క్ ఆ ప‌ని చేయ‌లేదు. బ్యాట‌ర్‌కు వార్నింగ్ మాత్ర‌మే ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఏం జ‌రిగిందంటే..?

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ మొద‌టి ఓవ‌ర్‌ను ఆసీస్ పేస‌ర్ మిచెల్ స్టార్ వేశాడు. నాలుగో బంతిని స్టార్క్ వేయ‌క‌ముందే నాన్ స్ట్రైక‌ర్ ఎండ్‌లో ఉన్న కుశాల్ పెరీరా క్రీజు వ‌దిలి ముందుకు వెళ్లిపోయాడు. దీన్ని గ‌మ‌నించిన స్టార్క్ బంతిని వేయ‌కుండా ఆగిపోయాడు. ఆ స‌మ‌యంలో అత‌డు కుశాల్ పెరీరాను మ‌న్క‌డింగ్ (ర‌నౌట్‌) చేయొచ్చు. అయితే.. స్టార్క్ ఆ ప‌ని చేయ‌లేదు. కుశాల్ పెరీరాకు అలా చేయొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఫీల్డ్ అంఫైర్‌కు సైతం ఫిర్యాదు చేశాడు.

2028 LA Olympics : లాంఛ‌నం పూర్తి.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. 128 ఏళ్ల త‌రువాత‌

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స్టార్క్ క్రీడాస్పూర్తి చూపించాడంటూ కొంద‌రు అత‌డిని ప్ర‌శంసిస్తున్నారు. అయితే.. ఇంకొంద‌రు మాత్రం అత‌డిని విమ‌ర్శిస్తున్నారు. బంగారం లాంటి అవ‌కాశాన్ని వ‌దిలివేశావు. ఇలానే క్యాచ్‌ల‌ను కూడా వ‌దిలివేస్తావా..? రూల్స్ పాటించాల‌ని గ‌దా అని కామెంట్లు చేస్తున్నారు.

అస‌లు మ‌న్క‌డింగ్ అంటే ఏమిటీ..?

క్రికెట్ నిబంధ‌న‌ 41.16 ప్రకారం బౌలర్‌ బంతి విసరకముందే నాన్ స్ట్రైయిక‌ర్‌ క్రీజ్‌ దాటి ముందుకు వెళ్లిన‌ప్పుడు బౌల‌ర్ ఆ బ్యాట‌ర్‌ను ర‌నౌట్ చేయొచ్చు. దీన్ని1947–48 ఆస్ట్రేలియా పర్యటనలో మొద‌టి సారి భారత దిగ్గజ బౌలర్‌ వినూ మన్కడ్‌ చేయడంతో ఆయ‌న పేరు మీదుగానే దీన్ని పిలుస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో దీనిపై విమ‌ర్శ‌లు రావ‌డంతో దీన్ని కూడా ర‌నౌట్‌గానే పరిగ‌ణించాల‌ని ఐసీసీ తెలియ‌జేసింది.

Rashid Khan : ఢిల్లీ ప్ర‌జ‌ల‌ పై అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ కామెంట్స్‌.. వైర‌ల్

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)