బౌలింగ్‌తోనే కాదు.. బ్యాటింగ్‌లోనూ ఇరగదీస్తానంటున్న టీమ్ఇండియా క్రికెటర్.. ఎవరో తెలుసా..?
బీసీసీఐ తొలి రెండు టెస్టుల కోసం జట్టును ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కని సంగతి తెలిసిందే.

Mohammed Shami Displays Batting Prowess in Nets
Mohammed Shami : అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు టీమ్ఇండియా దృష్టంతా ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ పైనే ఉంది. జనవరి 25 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. ఇప్పటికే బీసీసీఐ తొలి రెండు టెస్టుల కోసం జట్టును ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కని సంగతి తెలిసిందే.
గాయంతో బాధపడుతూనే వన్డే ప్రపంచకప్ ఆడిన షమీ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడిని సెలక్టర్లు ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టు లకు ఎంపిక చేయలేదు. ప్రస్తుతం షమీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు.
WTC Points table : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..
తాజాగా అతడు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. స్వతహాగా బ్యాటర్ అయిన షమీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అతడు ఖచ్చితమైన షాట్లు ఆడాడు. ఓ పర్‌ఫెక్ట్ బ్యాటర్‌లా బంతులను బౌండరీలకు తరలించాడు.
ఈ వీడియోకి షమీ మనం కష్టపడి చేసే పని ఏదైనప్పటికీ అది మంచి ఫలితాన్ని ఇస్తుందని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. షమీ కోలుకున్నాడని, మిగిలిన మూడు మ్యాచుల్లో ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపిస్తాడని అంటున్నారు.
View this post on Instagram