Video: సిరాజ్.. కంటి చూపుతో చంపేస్తావా ఏంటి? ఇంగ్లాండ్ స్టార్‌ బ్యాటర్‌ను ఔట్ చేశాక సిరాజ్ సింహ గర్జన.. చూశారా?

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సిరాజ్‌ అత్యుత్సాహం ప్రదర్శించాడని విమర్శలు కూడా వస్తున్నాయి.

Video: సిరాజ్.. కంటి చూపుతో చంపేస్తావా ఏంటి? ఇంగ్లాండ్ స్టార్‌ బ్యాటర్‌ను ఔట్ చేశాక సిరాజ్ సింహ గర్జన.. చూశారా?

Updated On : July 13, 2025 / 5:23 PM IST

లండన్‌లోని లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్, భారత్‌ మధ్య మూడో టెస్టు మ్యాచు నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. టీమిండియా బౌలర్‌ సిరాజ్‌ ఇవాళ బెన్‌ డకెట్‌ను (12)ను అద్భుతమైన రీతిలో ఔట్ చేశాడు. సిరాజ్ వేసిన బాల్‌ను పుల్‌ షాట్‌ ఆడే యత్నంలో బుమ్రాకు బెన్‌ డకెట్‌ చాలా ఈజీగా క్యాచ్‌ ఇచ్చుకుని ఔట్ అయ్యాడు.

ఆ సమయంలో సిరాజ్ సింహ గర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సిరాజ్‌ అత్యుత్సాహం ప్రదర్శించాడని విమర్శలు కూడా వస్తున్నాయి.

Also Read: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు

ఇంగ్లాండ్, భారత్‌ మధ్య మూడో టెస్టు మ్యాచు మూడో రోజు చివరలో శుభ్‌మన్ గిల్, జాక్ క్రాలీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగో రోజు ఉదయం ఆట ప్రారంభించిన తర్వాత కూడా మైదానంలో సిరాజ్ ప్రవర్తనతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

లెంగ్త్ బాల్‌ను డకెట్ తప్పుడుగా షాట్‌ ఆడడంతో మిడ్ ఆన్‌లో బుమ్రా క్యాచ్ పట్టాడు. వికెట్‌ తీసిన తర్వాత సిరాజ్ రెచ్చిపోతూ డకెట్‌కు ఎదురుగా వెళ్లి భీకరంగా అరిచాడు. సిరాజ్‌ మూడో రోజు మ్యాచు జరుగుతున్న సమయంలోనూ ఇలాగే రెచ్చిపోయిన విషయం విదితమే.

కాగా, ఇవాళ 20 ఓవర్ల నాటికి ఇంగ్లాండ్‌ స్కోరు 77-3గా ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387కి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కూడా 387 పరుగులకే ఆలౌట్ కావడం విశేషం.