Ms Dhoni: మ్యాచ్‌లో ధోనీని బౌల్డ్ చేసిన కడప కుర్రాడు
రానున్న ఐపీఎల్ సీజన్ కు రెడీ అవుతున్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ ఉంది. ఎంఎస్ ధోనీ ఆధ్వర్యంలో ఐసోలేషన్ పీరియడ్ ముగించుకుని సొంత స్టేడియం వేదికగా ప్రాక్టీస్..

Ms Dhoni Bowled By Csks New Recruit Harishankar Reddy1
Ms Dhoni: రానున్న ఐపీఎల్ సీజన్ కు రెడీ అవుతున్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ ఉంది. ఎంఎస్ ధోనీ ఆధ్వర్యంలో ఐసోలేషన్ పీరియడ్ ముగించుకుని సొంత మైదానం చిదంబరం స్టేడియం వేదికగా ప్రాక్టీస్ మొదలెట్టేశాయి. గతేడాది కూడా యూఏఈ వేదికగా మ్యాచ్ లు జరగడానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్ నిర్వహించాయి.
మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్ నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుత సీజన్ కు కూడా ధోనీ అధ్యక్షతన క్యాంప్ నిర్వహిస్తున్నారు. అభిమానుల కోసం ప్రాక్టీస్ అప్‍డేట్స్, మ్యాచ్ ఆడటానికి వచ్చారనేవి ఫొటోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటోంది సూపర్ కింగ్స్ సోషల్ మీడియా.
అందులో భాగంగానే సీఎస్కే యంగ్‌స్టార్ హరిశంకర్ రెడ్డి మహేంద్ర సింగ్ ధోనీని అవుట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన ఫేసర్ బౌల్డ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
లిస్ట్ ఏ మ్యాచ్‌లు 5 ఆడాడు. అంతేకాకుండా 13టీ20 మ్యాచ్ లు కూడా ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ రూ.20లక్షలు కనీస ధరకు కొనుగోలు చేసింది. సాధారణంగా చెన్నై టీం మేనేజ్మెంట్ తుది పదకొండు మంది జట్టులోకి అనుభవమున్న ప్లేయర్లనే ఆహ్వానిస్తుంది. మరి హరిశంకర్ రెడ్డికి అవకాశం దక్కుతుందో లేదో.. చూడాలి.
రాబోయే సీజన్ విషయానికొస్తే ఈ సారి సురేశ్ రైనా హాజరయ్యేలా కనిపిస్తున్నాడు. గతేడాది టోర్నమెంట్ నుంచి రైనా, హర్భజన్ తప్పుకున్నారు. మూడు సార్లు చాంపియన్ అయిన జట్టు ప్లే ఆఫ్ కు కూడా చేరుకోలేకపోయింది.