ఆసీస్‌తో సిరీస్‌కు ముందు: వాళ్ల కోసం ధోనీ ఫుట్‌బాల్..

ఆసీస్‌తో సిరీస్‌కు ముందు: వాళ్ల కోసం ధోనీ ఫుట్‌బాల్..

Updated On : February 19, 2019 / 1:24 PM IST

ఎప్పుడు అవకాశమొచ్చినా తనలోని ఫుట్‌బాల్ స్కిల్స్‌ను చూపించడానికి ముందుండే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. మరోసారి చారిటీ మ్యాచ్‌తో ఫుట్‌బాల్ మైదానంలో మెరిసి సత్తా చాటాడు. టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో కూడా ఫుట్‌బాల్‌ ఆడే ధోనీ.. చూడటానికి కూడా ఎప్పుడూ ఫుట్‌బాల్ ప్లేయర్ లానే కనిపిస్తుంటాడు. కొత్తగా ముంబైలోని జుహు ప్రాంతంలో చారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు. ధోనీ ఫుట్‌బాల్ స్కిల్స్ చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. 

ఇదే మ్యాచ్‌లో ఇంకొంత సీరియస్‌నెస్ కోసం ఆసియా కప్ విజేత అయిన భారత జట్టులోని ఆటగాళ్లు ఇషాన్ ఖట్టర్, నిక్ జోనస్‌లు కూడా ఆడించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు అయిన అపరశక్తి ఖురానా, డినో మోరియాలు కూడా మ్యాచ్‌లో భాగమైయ్యారు. ఆటతో పాటే.. ట్రెండ్ ఫాలో అవడంలో కూడా ముందుండే ధోనీ ఈ మ్యాచ్‌లోనూ కొత్త గెటప్‌తో కనిపించి అలరించాడు. కొత్త హెయిర్ స్టైల్‌తో ఫుట్‌బాల్ బూట్లతో కనిపించి ప్రత్యేకమైన ప్రదర్శన చేశాడు.  

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలలో ఆడిన మహీ పూర్తి ఫామ్‌తో కనిపిస్తున్నాడు. వికెట్ కీపింగ్ విషయానికొస్తే కెరీర్ ఆరంభం నుంచి న్యూజిలాండ్‌తో ముగిసిన మ్యాచ్ వరకూ వేగంలో ఏ మార్పు కనిపించకుండా దూసుకుపోతున్నాడు. వరల్డ్ కప్ జట్టులో కూడా ధోనీని తీసుకునే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. బ్యాటింగ్‌తో బలం చేకూర్చకపోయినా కీలక సమయాల్లో ధోనీ సలహాలు జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి.