Rahmanullah Gurbaz : అఫ్గాన్ క్రికెటర్‌కు గిఫ్ట్ పంపిన ధోని.. అదేంటో తెలుసా..?
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనను అభిమానించే ఆటగాళ్లకు బహుమతులను పంపడం అతడికి అలవాటే.

Rahmanullah Gurbaz-Dhoni
Rahmanullah Gurbaz-Dhoni: టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనను అభిమానించే ఆటగాళ్లకు బహుమతులను పంపడం అతడికి అలవాటే. ఈ క్రమంలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్, అఫ్గానిస్థాన్ ఆటగాడు రహ్మనుల్లా గుర్భాజ్(Rahmanullah Gurbaz)కు సైతం ఓ బహుమతిని పంపి అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ విషయాన్ని గుర్భాజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Virat Kohli : జిమ్‌లో కోహ్లి వర్కౌట్లు.. సాకులు వెదుకుతూనే ఉంటారా..? మరింత మెరుగవుతారా..?
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్‌లో గుర్భాజ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున ఆడాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు అతడు మాట్లాడుతూ తనకు ధోని అంటే ఎంతో ఇష్టం అని చెప్పాడు. ధోనితో కలిసి లేదా అతడికి ప్రత్యర్థిగా ఆడాలనేది తన కోరిక అని తెలిపాడు. కాగా.. ఈ సీజన్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడడంతో అతడి కోరిక నెరవేరింది. అయితే ఆ మ్యాచ్‌లో గుర్భాజ్ విఫలం అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక ఈ సీజన్‌లో గుర్భాజ్11 మ్యాచ్‌లు ఆడి 20.64 సగటుతో 133.53 స్ట్రైక్ రేట్‌తో 227 పరుగులు చేశాడు.
David Warner : వీరేంద్ర సెహ్వాగ్‌ను వెనక్కి నెట్టిన వార్నర్.. అరుదైన రికార్డు
అయితే.. తాజాగా ధోని తన జెర్సీ పై సంతకం చేసి గుర్భాజ్‌కు పంపించాడు. దీన్ని గుర్భాజ్ మంగళవారం అందుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ధోని పంపిన జెర్సీ ని ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో పాటు అతడికి ధన్యవాదాలు తెలియజేశాడు ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
View this post on Instagram
కాగా గతంలో.. 2022లో పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్‌కు కూడా ధోని ఇలాగే సంతకం చేసిన జెర్సీని గిఫ్ట్‌గా పంపిన సంగతి తెలిసిందే.