Ranji Trophy : ర‌హానే నాయ‌క‌త్వంలో అద‌ర‌గొట్టిన ముంబై.. రికార్డు స్థాయిలో 48వ సారి..

రంజీట్రోఫీలో ముంబై జ‌ట్టు త‌న ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తోంది.

Ranji Trophy : ర‌హానే నాయ‌క‌త్వంలో అద‌ర‌గొట్టిన ముంబై.. రికార్డు స్థాయిలో 48వ సారి..

Ranji Trophy 2024

Ranji Trophy 2024 : రంజీట్రోఫీలో ముంబై జ‌ట్టు త‌న ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తోంది. త‌మిళ‌నాడుతో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 70 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. కాగా.. రంజీట్రోఫీలో ముంబై ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం ఇది 48వ సారి కావ‌డం విశేషం. రంజీట్రోఫీ చ‌రిత్ర‌లో మ‌రే జ‌ట్టు కూడా ఇన్ని సార్లు ఫైన‌ల్స్‌కు చేరుకోలేదు. ఇందులో 41 సార్లు ట్రోఫీని గెలుచుకోవ‌డం గ‌మ‌నార్హం. ముంబై త‌రువాత కర్ణాటక అత్య‌ధిక సార్లు ఫైన‌ల్‌కు వెళ్లింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన త‌మిళ‌నాడు జ‌ట్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో 146 ప‌రుగుల‌కే ఆలౌటైంది. అనంత‌రం శార్దూల్ ఠాకూర్ (109; 104 బంతుల్లో 13 ఫోర్లు, 4సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 378 ప‌రుగులు చేసింది. దీంతో ముంబైకి మొద‌టి ఇన్నింగ్స్‌లో 232 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. ఆ త‌రువాత భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన త‌మిళ‌నాడు 162 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

Yashasvi Jaiswal : ఐసీసీ అవార్డు రేసులో య‌శ‌స్వి జైస్వాల్‌

త‌మిళ‌నాడు బ్యాట‌ర్ల‌లో బాబా ఇంద్ర‌జిత్ (70; 105 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. ముంబై బౌల‌ర్ల‌లో షామ్స్ ములానీ నాలుగు వికెట్లు తీశాడు. తనుష్ కోటియన్, మోహిత్ అవస్తి, శార్దూల్ ఠాకూర్ లు తలా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ముంబై విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ల‌భించింది.

CSK : ఇలాగైతే సీఎస్‌కే క‌ప్ కొట్ట‌డం క‌ష్ట‌మే!.. ఐపీఎల్ ఆరంభం కాక‌ముందే ఇలా..

ఇక రంజీట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ముంబై జ‌ట్టు విద‌ర్భ‌-మ‌ధ్య‌ప్ర‌దేశ్ మ‌ధ్య జ‌రుగుతున్న తొలి సెమీఫైన‌ల్‌లో గెలుపొందిన జ‌ట్టుతో ఆడ‌నుంది.