RCB vs SRH : సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ముందు ఆర్‌సీబీకి వార్నింగ్..
లక్నోలోని ఎకానా స్టేడియంలో శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియంలో శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా.. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించిన సన్‌రైజర్స్‌తో ఆర్‌సీబీకి ముప్పుతప్పదని అంటున్నాడు టీమ్ఇండియా మాజీ ఆటగాడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఈ మ్యాచ్‌లో ఒత్తిడి అంతా ఆర్‌సీబీపైనే ఉంటుందని చెప్పాడు.
ఇప్పటికే ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికి కూడా.. లీగ్ దశ ముగిసే సరికి టాప్-2లో నిలవాలంటే సన్‌రైజర్స్ పై గెలిచి రెండు పాయింట్లు సొంతం చేసుకోవడం ఆ జట్టుకు ఎంతో కీలకం అని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ పై ఒత్తిడి ఉంటుందని, అదే సమయంలో ప్లేఆఫ్స్ ఒత్తిడి లేకపోవడంతో ఎస్ఆర్‌హెచ్ స్వేచ్ఛగా ఆడుతుందన్నాడు.
SRH vs RCB : ఇచ్చిన మాటను పాట్ కమిన్స్ నిలబెట్టుకుంటాడా? ఆర్‌సీబీతో సన్‌రైజర్స్ మ్యాచ్ నేడే..
గత మ్యాచ్‌లో లక్నో ఎలా ఆడిందో అందరం చూశామని, ప్లేఆఫ్స్ ఒత్తిడి లేకపోవడంతో గుజరాత్ టైటాన్స్ ఓడించి వారి టాప్-2 స్థానాన్ని సంక్లిష్టం చేసిందన్నాడు. అదే విధంగా ఎస్ఆర్‌హెచ్ ఆడే అవకాశం ఉందన్నాడు. ఈ క్రమంలో ఆర్‌సీబీ ఏమర పాటుగా ఉండకూడని, చాలా జాగ్రత్తగా ఆడాలని సిద్ధూ సూచించాడు.
సన్‌రైజర్స్ పై గెలిస్తే.. లీగ్ దశ ముగిసే నాటికి ఆర్‌సీబీ టాప్-2లో ఉండే అవకాశం పుష్కలంగా ఉంటుందన్నాడు. 2016 ఐపీఎల్ సీజన్‌ను మినహాయిస్తే.. 2011 నుంచి 2024 వరకు టాప్-2లో ఉన్న జట్లే ఐపీఎల్ విజేతగా నిలిచాయని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ టాప్-2లో ఉండాలని, అప్పుడే ఆ జట్టు చిరకాల వాంఛ అయిన ఐపీఎల్ టైటిల్ దక్కే అవకాశం ఉందన్నాడు.
ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ జట్లు ఇప్పటి వరకు 25 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో ఆర్‌సీబీ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 13 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈ సీజన్‌లో ఇరు జట్లు ముఖాముఖిగా తలపడడం ఇదే తొలి సారి.