SRH vs RCB : ఇచ్చిన మాటను పాట్ కమిన్స్ నిలబెట్టుకుంటాడా? ఆర్‌సీబీతో సన్‌రైజర్స్ మ్యాచ్ నేడే..
సీజన్ ఆరంభానికి ముందు ఇచ్చిన మాటను సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ నిలబెట్టుకుంటాడా? లేదా?

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటికే ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది. ఈ సీజన్‌లో లీగ్ దశలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో కాస్త మెరుగైన స్థానంతో సీజన్‌ను ముగించాలని ఎస్ఆర్‌హెచ్ భావిస్తోంది. ఈ క్రమంలో నేడు (మే23 శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు లక్నోలోని ఎకానా స్టేడియం వేదిక కానుంది.
ఇప్పటికే ఆర్‌సీబీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నప్పటికి కూడా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ను ఆ జట్టు కీలకంగా భావిస్తోంది. ఎస్ఆర్‌హెచ్ పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరచుకుని, లీగ్ దశ ముగిసే నాటికి టాప్-2లో ఉండాలని భావిస్తోంది. ఈ క్రమంలో మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
GT vs LSG : గుజరాత్ పై విజయం.. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా ట్వీట్ వైరల్.. మళ్లీ..
300 లోడింగ్..
కాగా.. ఈ సీజన్ ఆరంభానికి ముందు అభిమానులతో జరిగిన ఓ చిట్‌చాట్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఓ మాట ఇచ్చాడు. ఈ సీజన్‌లో 300 కొడతామని మాట ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై 286 పరుగులు చేసింది ఎస్ఆర్‌హెచ్. 300 రన్స్‌కు కేవలం 14 పరుగుల దూరంలో ఆగిపోయింది.
దీంతో ఈ సీజన్‌లో 300 మైలురాయిని ఎస్ఆర్‌హెచ్ ఈజీగా కొడుతుందని అంతా భావించారు. అయితే.. సీన్ రివర్స్ అయింది. 300 డ్రీమ్‌గానే ఉంది. ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు (ఆర్‌సీబీ, కేకేఆర్)తో ఆడనుంది. ఇచ్చిన మాటను కమిన్స్ నిలబెట్టుకోవాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లోనే ఏదో ఒక మ్యాచ్‌లోనే కొట్టాల్సి ఉంది. అది ఆర్‌సీబీ పై అయితే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఇప్పుడు ప్లేఆఫ్స్ ఒత్తిడి లేకపోవడంతో నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 300 పరుగులు చేస్తుందా లేదో చూడాల్సిందే.