KKR Vs SRH రానా హాఫ్ సెంచరీ

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 01:37 PM IST
KKR Vs SRH రానా హాఫ్ సెంచరీ

Updated On : March 24, 2019 / 1:37 PM IST

కోల్ కతా : ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ నితీష్ రానా హాఫ్ సెంచరీతో రాణించాడు. 35 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 2 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. రానా ఐపీఎల్ కెరీర్ లో ఇది 6వ హాఫ్ సెంచరీ. రానా స్టార్టింగ్ నుంచి చక్కని షాట్లు ఆడాడు. రాబిన్ ఉతప్ప 27 బంతుల్లో 35 పరుగులు బాదాడు. ఊపుమీదున్న ఉతప్పను కౌల్ ఔట్ చేశాడు. సిద్ధార్థ్‌ కౌల్‌ వేసి 11.4వ బంతిని ఆడబోయి రాబిన్‌ ఉతప్ప క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు. దీంతో కోల్ కతా బ్యాట్స్ మెన్ పరుగులు చేసేందుకు శ్రమిస్తున్నారు. 182 పరుగుల టార్గెట్ తో కోల్ కతా బరిలోకి దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు.. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరగులు చేసింది.

కోల్‌కతా కెప్టెన్ దినేశ్‌ కార్తీక్‌ ఫెయిల్ అయ్యాడు. 4 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సందీప్ శర్మ 12.4వ బంతిని తక్కువ వేగంతో వేశాడు. కవర్స్‌ వైపు గాల్లోకి లేచిన బంతిని భువి ఈజీగా అందుకున్నాడు.