NZ vs Pak: ఉప్పల్ వార్మప్ మ్యాచ్‌.. పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ సంచలన విజయం

స్టేడియంలో అభిమానులు లేకుండానే ఈ వార్మప్ మ్యాచ్ జరిగింది.

NZ vs Pak: ఉప్పల్ వార్మప్ మ్యాచ్‌.. పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ సంచలన విజయం

NZ vs Pak

Updated On : September 29, 2023 / 10:46 PM IST

చెలరేగిన కివీస్ బ్యాటర్లు.. పాకిస్తాన్ చిత్తు
వరల్డ్ కప్ లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై న్యూజిలాండ్ సంచలన విజయం నమోదు చేసింది. భారీ లక్ష్యాన్ని ఈజీగా ఛేజ్ చేసింది. 5 వికెట్ల తేడాతో మరో 38 బంతులు మిగిలి ఉండగానే విజయదుంధుబి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగుల భారీ స్కోర్ చేసింది. 346 రన్స్ టార్గెట్ ను కివీస్ జట్టు 43.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(97), మార్క్ చాప్ మన్(65*), డారిల్ మిచెల్(59), కేన్ విలియమ్ సన్(54) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

లక్ష్య ఛేదనలో..
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ నువ్వా-నేనా అన్నట్లు ఆడుతోంది. 37 ఓవర్ల నాటికి న్యూజిలాండ్ స్కోరు 266/4గా ఉంది.

న్యూజిలాండ్ టార్గెట్ 346 పరుగులు

న్యూజిలాండ్ ముందు పాక్ 346 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పాక్ బ్యాటర్లలో బాబర్ 80, రిజ్వాన్ 103, షకీల్ 75 పరుగులు తీశారు. నిర్ణీత 50 ఓవర్లలో పాక్ 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది.

రిజ్వాన్ సెంచరీ

రిజ్వాన్ సెంచరీ బాదాడు. అందులో రెండు సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి. సెంచరీబాదాక రిటైర్డ్ ఔట్ అయ్యాడు.

బాబర్ ఔట్

బాబర్ 80 పరుగులకు ఔటయ్యాడు. రిజ్వాన్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. పాక్ స్కోరు 33 ఓవర్లకు 176/3గా ఉంది.

మ్యాచ్‌పై వరుణుడి కరుణ

వాన వెలియడంతో ఆట మళ్లీ మొదలైంది. బాబర్ అజాం, రిజ్వాన్ నిదానంగా ఆడుతున్నారు.

ఆటను ఆపేసిన వాన

ఉప్పల్ వార్మప్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. పాకిస్థాన్ 18 ఓవర్లకు 80/2 స్కోరు చేసింది. బాబర్ అజాం 36, రిజ్వాన్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. వాన వెలిస్తే ఆట కొనసాగుతుంది.

రెండు వికెట్లు డౌన్

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తోంది. పాకిస్థాన్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు అబ్దుల్ షఫీ 14 పరుగులకే ఔట్ కాగా, ఇమామ్ ఉల్ హక్ ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. సాంట్నర్, హెన్రీకి ఒక్కో వికెట్ చొప్పున దక్కాయి.

స్టేడియంలో క్రికెట్ అభిమానులు లేకుండా ఈ వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. రెండు పండుగలు ఉండడంతో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసుల సూచనల మేరకు ఈ వార్మప్ మ్యాచుకు ప్రేక్షకులను అనుమతించలేదు.

పాకిస్థాన్ అక్టోబరు 6న నెదర్లాండ్స్ తో ప్రపంచకప్ లో తొలి మ్యాచు ఆడనుంది. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ లో వన్డే ప్రపంచకప్-2023లో జరగనుంది. ఈ నేపథ్యంలోవార్మప్ మ్యాచులు జరుగుతున్నాయి.

Asian Games : ఆసియా క్రీడల్లో రజతం సాధించిన ఇషా సింగ్, తెలంగాణ బిడ్డ ఘనత అంటూ సీఎం కేసీఆర్ అభినందనలు