IND vs PAK : ఓట‌మి బాధ‌లో ఉన్న పాక్‌కు మ‌రో భారీ షాక్‌.. ఆనందంలో భార‌త అభిమానులు.. అప్పుడు భార‌త్ పై శ‌త‌కం..

భార‌త జ‌ట్టుతో కీల‌క‌మైన మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు భారీ షాక్ త‌గిలింది.

IND vs PAK : ఓట‌మి బాధ‌లో ఉన్న పాక్‌కు మ‌రో భారీ షాక్‌.. ఆనందంలో భార‌త అభిమానులు.. అప్పుడు భార‌త్ పై శ‌త‌కం..

Pakistan star player Fakhar Zaman Ruled Out Of Champions Trophy 2025

Updated On : February 20, 2025 / 3:13 PM IST

డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన పాకిస్థాన్‌కు భారీ షాక్ త‌గిలింది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 60 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న ఆ జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఆ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్ ఫ‌ఖ‌ర్ జ‌మాన్ గాయ‌ప‌డ్డాడు. అత‌డి గాయానికి వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా గాయం తీవ్ర‌మైన‌ట్లుగా తేలింది. కొన్ని వారాల పాటు అత‌డికి విశ్రాంతి అవ‌స‌రం అని వైద్యులు సూచించారు. దీంతో అత‌డు ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి త‌ప్పుకున్నాడు.

ఈ విష‌యాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దీంతో అత‌డు భార‌త్‌తో ఆదివారం (ఫిబ్ర‌వ‌రి 23న‌) జ‌ర‌గ‌నున్న మ్యాచ్ ఆడ‌డు. భార‌త్‌తో కీల‌క‌మైన మ్యాచ్‌కు ఫ‌ఖ‌ర్ అత‌డు దూరం కావ‌డం పాక్‌కు ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. ఇక అత‌డి స్థానంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇమామ్ ఉల్ హక్ ను తీసుకోనున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

IND vs BAN : టాస్ ఓడిన రోహిత్ శ‌ర్మ‌.. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌.. భార‌త తుది జ‌ట్టులో రెండు మార్పులు

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేసిన ఫ‌ఖ‌ర్ బంతిని ఆపే క్ర‌మంలో గాయ‌ప‌డ్డాడు. అయిన‌ప్ప‌టికి అత‌డు బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. వాస్త‌వానికి అత‌డు ఓపెన‌ర్‌గా రావాల్సి ఉండ‌గా.. నాలుగో స్థానంలో బ‌రిలోకి దిగాడు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అత‌డు తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డాడు. మొత్తంగా 41 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 24 ప‌రుగులు చేశాడు.

నాటి ఫైన‌ల్ లో భార‌త్ పై సెంచ‌రీ..

ఫ‌ఖ‌ర్ జ‌మాన్ 2017లో భార‌త్‌తో జ‌రిగిన ఛాంపియ‌న్స్‌ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌లో సెంచ‌రీతో జ‌ట్టును ఆదుకున్నాడు. 106 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స‌ర్లు సాయంతో 114 ప‌రుగులు సాధించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 338 ప‌రుగులు చేసింది. అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త జ‌ట్టు త‌డ‌బ‌డింది. 30.3 ఓవర్ల‌లో 158 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త బ్యాట‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా (43 బంతుల్లో 76 ప‌రుగులు) ఒక్క‌డే రాణించాడు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో భార‌త్ 180 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. తొలిసారి పాక్ ఛాంపియ‌న్స్ ట్రోఫీని ముద్దాడింది.

IND vs PAK : కోహ్లీనే కాదు భారత క్రికెట‌ర్ల‌ను ఎవ్వ‌రిని హగ్ చేసుకోవద్దు..

అప్పుడు శ‌త‌కంతో భార‌త‌ ఓట‌మికి కార‌కుడు అయిన ఫ‌ఖ‌ర్ జ‌మాన్ ఆదివారం జ‌రిగే మ్యాచ్‌కు లేక‌పోవ‌డం పాక్ జ‌ట్టుకు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.