IND vs BAN : టాస్ ఓడిన రోహిత్ శర్మ.. బంగ్లాదేశ్ బ్యాటింగ్.. భారత తుది జట్టులో రెండు మార్పులు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్లు దుబాయ్‌లో తలపడుతున్నాయి.

pic credit@ BCCI twitter
ఛాంపియన్స్ ట్రోఫీపై భారత జట్టు కన్నేసింది. ఈ క్రమంలో ఈ మెగాటోర్నీలో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. దుబాయ్‌లోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. కాగా.. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇంగ్లాండ్‌తో ఆడిన చివరి వన్డేతో పోలిస్తే భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వరుణ్ చక్రవర్తి స్థానంలో రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమీ జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఈమ్యాచ్‌లో గెలిచి విజయంతో టోర్నీని ఆరంభించాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు.
🚨 Toss 🚨#TeamIndia have been put in to bowl first in #BANvIND 👍
Updates ▶️ https://t.co/ggnxmdG0VK#ChampionsTrophy pic.twitter.com/zlmytCydsN
— BCCI (@BCCI) February 20, 2025
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీలకు ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ అని ప్రచారం సాగుతోంది. టీ20 ప్రపంచకప్ సాధించి పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికినట్లుగా ఈ మెగాటోర్నీలో విజయం సాధించి ఘనంగా వన్డేలకు వీడ్కోలు పలకాలని ఈ ఇద్దరు దిగ్గజాలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
బంగ్లాదేశ్ తుది జట్టు..
తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్