IND vs PAK : కోహ్లీనే కాదు భారత క్రికెట‌ర్ల‌ను ఎవ్వ‌రిని హగ్ చేసుకోవద్దు..

భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ ఆట‌గాళ్లకు ఆ దేశ ఫ్యాన్స్ ఓ విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

IND vs PAK : కోహ్లీనే కాదు భారత క్రికెట‌ర్ల‌ను ఎవ్వ‌రిని హగ్ చేసుకోవద్దు..

IND vs PAK, Champions Trophy, Champions Trophy 2025, Virat Kohli, Mohammad Rizwan

Updated On : February 15, 2025 / 4:36 PM IST

ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌నుంది. మొత్తం 8 జ‌ట్లు ఈ మెగాటోర్నీ బ‌రిలో ఉన్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూప్‌-ఏలో భార‌త్, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి.

ఇక గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, అఫ్గానిస్తాన్‌, ద‌క్షిణాఫ్రికాలో ఉన్నాయి. గ్రూప్‌లోని ఒక్కొ జ‌ట్టు మిగిలిన టీమ్‌తో ఒక్కొ మ్యాచ్ ఆడుతుంది. ఆ త‌రువాత ప్ర‌తి గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు సెమీఫైన‌ల్‌కు చేరుకుంటాయి. సెమీ ఫైన‌ల్‌లో విజ‌యం సాధించిన జ‌ట్లు ఫైన‌ల్‌కు చేరుకుంటాయి.

ఇరు దేశాల అభిమానులే కాకుండా యావ‌త్ క్రికెట్ అభిమానులు భార‌త్‌, పాక్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 23న జ‌ర‌గ‌నుంది. కాగా.. గ‌త రెండు ఐసీసీ టోర్నీల్లో పాక్ పై భార‌త్ విజ‌యం సాధించింది. దీంతో 2017లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో ఓడించిన‌ట్లుగా మ‌రోసారి భార‌త్‌ను ఓడించాల‌ని పాక్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Champions Trophy : ఛాంపియ‌న్స్ ట్రోఫీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు, అత్య‌ధిక ర‌న్స్‌ చేసిన జ‌ట్టు ఏదో తెలుసా?


ఛాంపియ‌న్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే.. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా పాక్ కు వెళ్లేది లేద‌ని బీసీసీఐ తేల్చి చెప్ప‌డంతో హైబ్రిడ్ మోడ్‌లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 జ‌ర‌గ‌నుంది. భార‌త్ ఆడే మ్యాచ్‌లు దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి. త‌మ జ‌ట్టును ఓడించ‌డంతో పాటు పాక్‌లో ఆడేందుకు విముఖ చూపిస్తుండ‌డంతో భార‌త ఆట‌గాళ్ల‌ను ఎవ్వ‌రూ హ‌గ్ చేసుకోవ‌ద్ద‌ని పాక్ క్రికెట‌ర్ల‌ను కొంద‌రు ఆ దేశ అభిమానులు హెచ్చ‌రిస్తున్నారు.

ఈ మేర‌కు పాకిస్తాన్ జర్నలిస్ట్ ఫరీద్ ఖాన్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ వరకు భారత క్రికెటర్లతో స్నేహాన్ని పక్కన పెట్టమని రిజ్వాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టును ఓ అభిమాని అడుగుతున్న‌ట్లుగా ఆ వీడియోలో ఉంది. విరాట్ కోహ్లీ,రోహిత్ శ‌ర్మ స‌హా ఎవ్వ‌రిని కౌగిలించుకోవ‌ద్ద‌ని అందులో ఓ అభిమాని కోరాడు.

మిగిలిన ఐసీసీ టోర్నీల్లో భార‌త్‌దే ఆధిప‌త్యం అయిన‌ప్ప‌టికి ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మాత్రం పాక్ దే కాస్త పై చేయిగా ఉంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌, పాక్ జ‌ట్లు ఐదు సంద‌ర్భాల్లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో పాక్ విజ‌యం సాధించ‌గా భార‌త్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది.

IND vs PAK : 2017 ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో భార‌త్ ఇంత చిత్తుగా ఓడిపోయిందా.. పాక్ పై ప్ర‌తీకారం తీర్చుకోవాల్సిందే..

స‌ర్ఫ‌రాజ్ ఖాన్ మాట్లాడుతూ..

2017లో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీలో గ్రూప్ ద‌శ‌తో భార‌త్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. అయితే.. ఆ త‌రువాత బ‌లంగా పుంజుకుని ఫైన‌ల్‌కు చేరి భార‌త్‌ను ఓడించి ఛాంపియ‌న్‌గా నిలిచింది. దీనిపై అప్ప‌టి కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ తాజాగా ఓ షోలో మాట్లాడాడు. అప్పుడు తొలి గేమ్‌లో భార‌త్ చేతిలో ఓడిపోయాము. ఆ త‌రువాత మీటింగ్ జ‌రిగింది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు షోయ‌బ్ మాలిక్‌, హ‌ఫీజ్‌లు మ‌మ్మ‌ల్ని ప్రోత్సహించారు. అలాంటి ఆట‌గాళ్లు జ‌ట్టులో ఉండ‌డం ఎంతో ముఖ్యం. దీంతో మా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. మా ఆత్మ‌విశ్వాసం పెరిగింది. ఫైన‌ల్‌లో భార‌త్‌ను ఓడించి విజేత‌గా నిలిచాం అని స‌ర్ఫ‌రాజ్ తెలిపాడు.