జట్టు నుంచి ఔట్ : రాయుడు, పంత్‌కు బీసీసీఐ షాక్

బీసీసీఐ 2019 ఐసీసీ వరల్డ్ కప్‌కు టీమిండియాను ప్రకటించింది. కొద్ది నెలలుగా తర్జనభర్జనలు పడుతోన్న నాల్గో స్థానాన్ని కేఎల్ రాహుల్‌కు అప్పగించిన సెలక్షన్ కమిటీ.. రాయుడుకు నిరాశనే మిగిల్చింది. కొద్ది రోజులుగా వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్‌లో సత్తా చాటుతున్న పంత్‌ను పక్కన పెట్టేసింది.
Read Also : పోటుగాళ్లు : వరల్డ్ కప్ టీమిండియా ఇదే
అనుభవానికే ప్రాధాన్యం:
రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్.. దినేశ్ కార్తీక్‌లలో ఎవర్నో ఒకర్ని మాత్రమే తీసుకోవాల్సిన పరిస్థితుల్లో అనుభవానికే ప్రాధాన్యమిచ్చింది సెలక్షన్ కమిటీ. దినేశ్ కార్తీక్‌కు అవకాశమిస్తూ ధోనీ తర్వాత మరో వికెట్ కీపర్‌గా జట్టులోకి చేర్చింది.
ఐపీఎల్ ప్రభావం లేదు:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కొద్ది రోజుల ముందు చెప్పినట్లుగానే ఐపీఎల్ ప్రభావం వరల్డ్ కప్ సెలక్షన్‌లో ఏ మాత్రం కనిపించలేదు. పైగా ఐపీఎల్ సీజన్ లో ప్లేయర్ల ఆటతీరు ప్రపంచ కప్ ప్రాక్టీస్ కు పనికొచ్చేటట్లు సిద్ధం అవుతున్నారు క్రికెటర్లు.
Read Also : జియో స్పెషల్ ఆఫర్ : IPL క్రికెట్ 4G డేటా ప్లాన్ ఇదే
Read Also : 2019 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే..