Paralympic 2024 : పారాలింపిక్స్‌లో భార‌త్‌కు మ‌రో స్వ‌ర్ణం.. ప‌సిడి ప‌త‌కాన్ని సొంతం చేసుకున్న నితేశ్‌ కుమార్‌

పారిస్ వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.

Paralympic 2024 : పారాలింపిక్స్‌లో భార‌త్‌కు మ‌రో స్వ‌ర్ణం.. ప‌సిడి ప‌త‌కాన్ని సొంతం చేసుకున్న నితేశ్‌ కుమార్‌

Nitesh Kumar clinches Paralympic gold in badminton

Updated On : September 2, 2024 / 5:25 PM IST

Paralympic 2024 : పారిస్ వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. దీంతో భార‌త్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణ ప‌త‌కం వ‌చ్చి చేరింది. పురుషుల బ్యాడ్మింటన్‌ విభాగంలో నితేశ్ కుమార్‌ స్వర్ణం సాధించాడు. కాగా.. అంత‌క‌ముందు పారా షూటర్‌ అవనీ లేఖరా స్వర్ణ పతకం సాధించిన సంగ‌తి తెలిసిందే.

నితేశ్ కుమార్ స్వ‌ర్ణంతో భార‌త్ ప‌త‌కాల సంఖ్య 9కి చేరింది. భార‌త ప‌త‌కాల‌లో రెండు స్వ‌ర్ణాలు, మూడు ర‌జ‌తాలు, నాలుగు కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి.

England : ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో ఇంగ్లాండ్ అరుదైన ఘ‌న‌త‌..

బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో నితేశ్‌ కుమార్ ఫైన‌ల్‌లో 21-14, 18-21, 23-21తో బ్రిట‌న్‌కు చెందిన డానియల్‌ బెతెల్ ను ఓడించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో బెతెల్ ర‌జ‌తం సాధించాడు. ఈ సారి ఫైన‌ల్‌లో కూడా చివ‌రి వ‌ర‌కు పోరాడినా ఆఖ‌రికి మ‌రోసారి ర‌జ‌తంతోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.