IND vs AUS : తొలి టెస్టులో పట్టుబిగించిన భారత్.. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ 104 ఆలౌట్.. టీమ్ఇండియాకు 46 పరుగుల కీలక ఆధిక్యం
పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టుబిగించింది

ind vs aus
పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టుబిగించింది. టీమ్ఇండియాకు కీలకమైన 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ స్టార్క్ (26), అలెక్స్ క్యారీ(21) లు రాణించారు. మిగిలిన వారంతా విఫలం అయ్యారు.
భారత బౌలర్లలో కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా రెండు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు సాధించాడు. అంతకముందు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.
Rishabh Pant : చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. డబ్ల్యూటీసీలో ఒకే ఒక్క వికెట్ కీపర్..
ఓవర్ నైట్ స్కోరు 67/7 తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ మరో 37 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు మ్యాచ్ ఆరంభమైన రెండో ఓవర్‌లోనే బుమ్రా షాకిచ్చాడు. తొలి బంతికే అతడు కేరీని ఔట్ చేశాడు. 19 పరుగుల వ్యకిగత స్కోరుతో రెండో రోజు మ్యాచ్ ఆరంభించిన కేరీ మరో రెండు పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మరి కాసేపటికే హర్షిత్ రాణా బౌలింగ్ నాథన్ లియాన్ ఔట్ అయ్యాడు.
అయితే.. ఆఖరి వికెట్ మాత్రం అంత త్వరగా రాలేదు. జోష్ హేజిల్ వుడ్(7 నాటౌట్)తో కలిసి మిచెల్ స్టార్క్ జట్టు స్కోరు వంద దాటించాడు. పదో వికెట్‌కు వీరిద్దరు 25 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం హర్షిత్ రాణా బౌలింగ్ స్టార్క్ ఔట్ కావడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
IPL Schedule : బీసీసీఐ కీలక నిర్ణయం.. ఒకేసారి మూడు ఐపీఎల్ సీజన్ల షెడ్యూల్ విడుదల!
Starc’s resilience comes to an end as Harshit Rana picks up the final wicket.
Australia all out for 104 runs.
Scorecard – https://t.co/dETXe6cqs9… #AUSvIND pic.twitter.com/f2d62oUcVK
— BCCI (@BCCI) November 23, 2024