PV Sindhu: యమగూచిని చిత్తు చేసి సెమీస్‌‌లోకి పీవీ సింధు

రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న పీవీ సింధు థాయ్‌లాండ్ ఓపెన్ 2022 సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జపాన్ కు చెందిన యమగూచిని క్వార్టర్ ఫైనల్‌లో ఓడించింది. బ్యాంకాక్ వేదికగా శుక్రవారం జరిగిన హోరాహోరీ గేమ్ లో 21-15, 20-22, 20-13 స్కోరు సాధించింది.

PV Sindhu: యమగూచిని చిత్తు చేసి సెమీస్‌‌లోకి పీవీ సింధు

Badminton Asia Championships Pv Sindhu Enters Semifinals, Assured Of A Medal (1)

Updated On : May 20, 2022 / 6:35 PM IST

PV Sindhu: రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న పీవీ సింధు థాయ్‌లాండ్ ఓపెన్ 2022 సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జపాన్ కు చెందిన యమగూచిని క్వార్టర్ ఫైనల్‌లో ఓడించింది. బ్యాంకాక్ వేదికగా శుక్రవారం జరిగిన హోరాహోరీ గేమ్ లో 21-15, 20-22, 20-13 స్కోరు సాధించింది.

తొలి గేమ్‌లో సింధు 21-15 తేడాతో విజయం సాధించింది. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న జపాన్‌ 20-22తో విజయం సాధించింది. సింధు చివరి గేమ్‌ను 21-13 తేడాతో గెలుపొందింది.

గురువారం రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఓటమి పాలైంది. మహిళల సింగిల్స్ విభాగంలో దక్షిణ కొరియాకు చెందిన యూ జిన్ సిమ్‌ను థాయ్‌లాండ్ ఓపెన్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఓడించింది. వరుస గేమ్‌లలో విజయం సాధించిన సింధు టోర్నీ క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది.

Read Also: తమిళ్ సాంగ్‌కు నడి రోడ్డుపై పీవీ సింధు డ్యాన్స్

శుక్రవారం రోజు ఉదయం జరిగిన గేమ్‌లో భారత షట్లర్ మాళవిక బన్సోద్ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన లైన్ క్రిస్టోఫర్సన్ చేతిలో 16-21, 21-14, 21-14 తేడాతో ఓడిపోయింది.