The A-Game : వ్యాఖ్యాతగా PV Sindhu

web series titled ‘The A-Game’ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (Olympic silver medallist PV Sindhu) కొత్త పాత్రలో అలరించనున్నారు. ప్రముఖ స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్థ బేస్ లైన్ వెంచర్స్ నిర్మిస్తున్న ది ఎ గేమ్ వెబ్ సిరీస్ కు సింధు వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. ఇది క్రీడలకు సంబంధించింది.
విజయాలు సాధిస్తూ..భారత్ కు పేరు ప్రఖ్యాతలు సాధించిన ప్లేయర్స్ తమ అనుభవాలను ఇందులో పాల్గొననున్నారు. మొత్తం 5 ఎపిసోడ్ లు ప్రసారం కానున్నాయి. ఇప్పటికే పలువురు క్రీడాకరులతో సింధు ముచ్చటించారు.
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, రెజ్లర్ సాక్షి మలిక్, షూటర్ గగన్ నారంగ్, లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్, ఫుట్‌బాలర్ బైచుంగ్ భూటియా, స్నూకర్–బిలియర్డ్స్ స్టార్ పంకజ్ అద్వానీలతో సింధు ముచ్చటించనుంది.
ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ..ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఒత్తిడి సమయంలో దిగ్గజ అథ్లెట్ల ఆలోచనా విధానాన్ని వారి శక్తి సామర్థ్యాల్ని ఈ షో ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఈ వెబ్ సిరీస్ Youtube, Twitter, Instagram మాధ్యమాల్లో ప్రసారం కానుంది.