SA vs AFG : చ‌రిత్ర సృష్టించిన క్వింట‌న్ డికాక్‌.. లారా రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన ఇబ్ర‌హీం జ‌ద్రాన్‌

South Africa vs Afghanistan : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో ప‌లు రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి.

SA vs AFG : చ‌రిత్ర సృష్టించిన క్వింట‌న్ డికాక్‌.. లారా రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన ఇబ్ర‌హీం జ‌ద్రాన్‌

Quinton de Kock-Ibrahim Zadran

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో ప‌లు రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌లోనూ ఓ రెండు రికార్డులు న‌మోదు అయ్యాయి. ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు క్వింట‌న్ డికాక్ చ‌రిత్ర సృష్టించగా, అఫ్గానిస్థాన్ యువ ఆట‌గాడు ఇబ్ర‌హీం జ‌ద్రాన్ వెస్టిండీస్ దిగ్గ‌జ ప్లేయ‌ర్ బ్రియాన్ లారా రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు.

వికెట్ కీప‌ర్‌గా చ‌రిత్ర సృష్టించిన డికాక్‌..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఓ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ఔట్ల‌ల‌లో భాగ‌స్వామ్యం పంచుకున్న ద‌క్షిణాఫ్రికా వికెట్ కీప‌ర్‌గా క్వింట‌న్ డికాక్ నిలిచాడు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ఇక్రమ్ అలీఖిల్ క్యాచ్ అందుకోవ‌డం ద్వారా అత‌డు ఈ ఘ‌నత సాధించాడు. ఈ క్ర‌మంలో డేవిడ్ రిచ‌ర్డ్‌స‌న్ రికార్డును బ్రేక్ చేశాడు. డేవిడ్ 15 ఔట్ల‌లో భాగ‌స్వామ్యం కాగా.. డికాక్ 16 ఔట్ల‌ల‌లో భాగ‌స్వామ్యం అయ్యాడు.

ద‌క్షిణాఫ్రికా త‌రుపున ఓ ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ఔట్ల‌ల‌లో భాగ‌స్వామ్యం అయిన వికెట్ కీప‌ర్‌లు..

క్వింటన్ డికాక్ – 16 (2023)
డేవిడ్ రిచర్డ్‌సన్ – 15 (1992)
మార్క్ బౌచర్ – 11 (1999)
మార్క్ బౌచర్ – 11 (2003)
క్వింటన్ డికాక్ – 10 (2015)

Virat Kohli : విరాట్ కోహ్లీ సృజనాత్మక ఆర్ట్.. చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు

లారా రికార్డు బ‌ద్ద‌లు..

Brian Lara-Ibrahim Zadran

Brian Lara-Ibrahim Zadranఅఫ్గానిస్థాన్ యువ ఆట‌గాడు, ఓపెన‌ర్ ఇబ్ర‌హీం జ‌ద్రాన్ ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఈ క్ర‌మంలో లారా రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 23 ఏళ్లు నిండ‌క ముందే ఓ ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో ఇబ్ర‌హీం జ‌ద్రాన్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 523 ప‌రుగుల‌తో స‌చిన్ అగ్ర‌స్థానంలో ఉన్నారు. వీరిద్ద‌రి త‌రువాత వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు బ్రియాన్ లారా మూడో స్థానంలో ఉన్నాడు.

23 ఏళ్లు నిండకముందే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాళ్లు..

సచిన్ టెండూల్కర్ – 523 ప‌రుగులు (1996)
ఇబ్రహీం జద్రాన్ – 376 ప‌రుగులు (2023)
బ్రియాన్ లారా – 333 ప‌రుగులు (1992)
ఉపుల్ తరంగ – 298 ప‌రుగులు (2007)
సచిన్ టెండూల్కర్ – 283 ప‌రుగులు (1992)
విరాట్ కోహ్లీ – 282 ప‌రుగులు (2011)
రహ్మానుల్లా గుర్బాజ్ – 280 ప‌రుగులు (2023)

Henry Nicholls : ఓ వైపు న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌కు స‌న్న‌ద్ధం అవుతుండ‌గా.. మ‌రోవైపు కివీస్ ఆట‌గాడిగాపై బాల్ టాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు