Asia Cup 2023: ఆరోజు పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్ చూడలేమా? అసలు విషయం ఏమిటంటే..

ఆసియా కప్ -2023 టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ పాకిస్థాన్ జట్టుతో ఆడుతుంది. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీలో మ్యాచ్ జరగనుంది.

Asia Cup 2023: ఆరోజు పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్ చూడలేమా? అసలు విషయం ఏమిటంటే..

india vs pakistan match

Updated On : August 31, 2023 / 10:29 AM IST

IND vs PAK Match In Asia Cup 2023: ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ నెలల్లో ఇండియా వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆసియా కప్ -2023 టోర్నీ జరుగుతుంది. బుధవారం పాకిస్థాన్ వేదికగా ఈ టోర్నీ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ వర్సెస్ నేపాల్ జట్లు ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో అతిధ్య పాకిస్థాన్ జట్టు భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు బాబర్, ఇఫ్తికార్ సెంచరీలు చేయడంతో 342 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన పసికూన నేపాల్ జట్టు కేవలం 23.4 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 238 పరుగుల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది. గురువారం సాయంత్రం శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Asia Cup Opening Ceremony : ఆసియా క‌ప్ ప్రారంభ‌ వేడుక‌.. పాట పాడిన పాకిస్తాన్ గాయ‌నీ.. నెట్టింట మీమ్ ఫెస్ట్‌

టీమిండియా విషయానికి వస్తే.. తొలి మ్యాచ్ పాకిస్థాన్ జట్టుతో ఆడుతుంది. సెప్టెంబర్ 2న పాకిస్థాన్, ఇండియా జట్లు శ్రీలంకలోని కాండీలో మ్యాచ్ ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సుదీర్ఘ విరామం తరువాత దాయాది జట్లు సమరానికి సిద్ధమవుతుండగా.. క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఉత్కంఠగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. నాలుగేళ్ల తరువాత ఇరు జట్లు తలపడుతున్నాయి. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు మొత్తం ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, వీరికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Asia Cup 2023: భారత్ ఎన్నిసార్లు ఆసియా కప్‌ విజేతగా నిలిచిందో తెలుసా? వన్డే ఫార్మాట్‌లో అత్యల్ప స్కోర్ ఆ జట్టుదే!

ఇండియా, పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 2న జరిగే మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని తెలిసింది. శనివారం కాండీలో వర్షం ముప్పు పొంచి ఉందని సమాచారం. ఆరోజు వర్షం పడేందుకు 90శాతం అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణంలో తేమ 84శాతం ఉంటుందని, తెలిపింది. ఫలితంగా ఆసియా కప్ 2023లో క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తే పాక్, ఇండియా మ్యాచ్ వరుణుడు ఖాతాలో పడే అవకాశాలు లేకపోలేదు.