Ravichandran Ashwin : చ‌రిత్ర సృష్టించిన అశ్విన్‌.. అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్‌.. తండ్రీకొడుకును ఔట్ చేసిన మొన‌గాడు

డొమినికా వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టులో భార‌త సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ (Ravichandran Ashwin) అరుదైన ఘ‌నత‌ను అందుకున్నాడు.

Ravichandran Ashwin : చ‌రిత్ర సృష్టించిన అశ్విన్‌.. అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్‌.. తండ్రీకొడుకును ఔట్ చేసిన మొన‌గాడు

Ravichandran Ashwin

Ashwin : డొమినికా వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టులో భార‌త సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ (Ravichandran Ashwin) అరుదైన ఘ‌నత‌ను అందుకున్నాడు. ఓపెన‌ర్ ట‌గ్‌న‌రైన్ చంద్ర‌పాల్‌ను క్లీన్ బౌల్డ్ చేయ‌డం ద్వారా విండీస్ మొద‌టి వికెట్ ప‌డ‌గొట్టాడు. ఈ క్ర‌మంలోనే భార‌త మాజీ కెప్టెన్, లెగ్ స్పిన్న‌ర్ అయిన అనిల్ కుంబ్లే (Anil Kumble) రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో ఓ బ్యాట‌ర్‌ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయ‌డం ఇది 95వ సారి.

WI vs IND : వెస్టిండీస్‌తో మొద‌టి టెస్టు.. అశ్విన్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు.. మూడు అడుగుల దూరంలో..

భార‌త బౌల‌ర్ల‌లో.. టెస్టుల్లో బ్యాట‌ర్ల‌ను అత్య‌ధిక సార్లు క్లీన్‌బౌల్డ్ చేసిన ఆట‌గాడిగా అశ్విన్ రికార్డుల‌కు ఎక్కాడు. ఇంతక‌ ముందు వ‌ర‌కు ఈ రికార్డు మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 94 సార్లు బ్యాట‌ర్ల‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ త‌రువాతి స్థానంలో క‌పిల్ దేవ్‌(88) ఉన్నారు.

టెస్లుల్లో అత్య‌ధిక క్లీన్ బౌల్డ్ చేసిన భార‌త బౌల‌ర్లు వీరే

ర‌విచంద్ర‌న్ అశ్విన్ – 95
అనిల్ కుంబ్లే – 94
క‌పిల్ దేవ్ – 88
మ‌హ్మ‌ద్ ష‌మీ – 66

WI vs IND : విరాట్ కోహ్లిని అత్య‌ధిక సార్లు ఔట్ చేసిన వెస్టిండీస్ బౌల‌ర్ ఎవ‌రో తెలుసా..?

తండ్రి, కొడుకును ఔట్ చేసిన బౌల‌ర్ గా..

టెస్టు క్రికెట్‌లో తండ్రీకొడుకు వికెట్ తీసిన తొలి భార‌త బౌల‌ర్‌గా అశ్విన్ చ‌రిత్ర సృష్టించాడు. 2011లో వెస్టిండీస్ మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు శివ‌నారాయ‌ణ్ చంద్ర‌పాల్ వికెట్ ప‌డ‌గొట్టిన అశ్విన్ నేటి మ్యాచ్‌లో అత‌డి కొడుకు ట‌గ్ న‌రైన్ చంద్ర పాల్ వికెట్ తీశాడు. ఇక ఓవ‌రాల్‌గా టెస్టుల్లో ఈ ఘ‌న‌త సాధించిన 5వ బౌల‌ర్‌గా నిలిచాడు.

టెస్టు క్రికెట్‌లో తండ్రీకొడుకును ఔట్ చేసిన బౌల‌ర్లు వీరే..

ఇయాన్ బోథమ్ – లాన్స్, క్రిస్ కెయిర్న్స్
వసీం అక్రమ్ – లాన్స్, క్రిస్ కెయిర్న్స్
మిచెల్ స్టార్క్ – శివ‌నారాయ‌ణ్ చంద్ర‌పాల్, టగ్‌న‌రైన్‌ చంద్రపాల్
సైమన్ హార్మర్ – శివనారైన్, టగ్‌న‌రైన్‌ చంద్రపాల్
రవిచంద్రన్ అశ్విన్ – శివ‌నారాయ‌ణ్ చంద్ర‌పాల్, టగ్‌న‌రైన్‌ చంద్రపాల్

ICC World Cup 2023 : ఒక వేళ పాకిస్తాన్ ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌కుంటే.. ఆ జ‌ట్టు స్థానంలో ఆడేది ఎవరంటే..?