IPL 2019: దిగొచ్చిన అశ్విన్.. ఇంకో అవకాశమివ్వండి

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. మార్చి 25 సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను మాన్కడే విధానం ద్వారా రనౌట్ చేసి దుమారం లేపాడు. దానికి తోడుగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మరోసారి నో బాల్ ఇన్సిడెంట్ విషయంలో వివాదంలో ఇరుక్కున్నాడు.
ఆ కాసేపటికి తప్పు తెలుసుకున్న పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఒప్పుకున్నాడు. తర్వాతి మ్యాచ్‌లో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని చెప్పుకొచ్చాడు. 17వ ఓవర్ బౌలింగ్ వేస్తున్న మొహమ్మద్ షమీ ఆఖరి బంతిని రస్సెల్‌కు యార్కర్‌గా విసిరాడు. ఆ బంతిని కోల్‌కతా అంపైర్‌కు ఫిర్యాదు చేయడంతో దానిని నో బాల్‌గా ప్రకటించాడు.
ఈ విషయమై మైదానంలో కాసేపటి వరకూ చర్చ జరిగింది. అశ్విన్.. దినేశ్ కార్తీక్‌లు అంపైర్‌తో చర్చ జరిపి నో బాల్ ఇవ్వడంతో రస్సెల్‌కు ఫ్రీ హిట్ దక్కింది. రస్సెల్ దూకుడుకు కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్లు నష్టపోయి 218పరుగులు చేయగలిగింది. లక్ష్య చేధనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విఫలమవడంతో 28 పరుగుల తేడాతో పరాజయానికి గురైంది.