కోహ్లీ క్యాచ్ పట్టాడు.. అశ్విన్ గ్లౌవ్స్ విసిరికొట్టాడు..

కోహ్లీ క్యాచ్ పట్టాడు.. అశ్విన్ గ్లౌవ్స్ విసిరికొట్టాడు..

Updated On : April 25, 2019 / 1:03 PM IST

ఏ ఆటకైనా ఎమోషన్ అనేది కీలకం. ఆ ఆవేశం.. క్రీడోత్సాహమే ఎంతసేపైనా మైదానంలో ఉండేలా చేస్తుంది. ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాలనే తపనే మనల్ని గెలిపిస్తుంది. ఏప్రిల్ 24బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి సన్నివేశమే ఒకటి చోటు చేసుకుంది. అశ్విన్ అవుట్ అయిన వెంటనే గ్లౌవ్స్ విసిరికొట్టాడు. 

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 202పరుగుల భారీ టార్గెట్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముందుంచింది. లక్ష్య చేధనలో భాగంగా దూకుడుగా ఆడిన పంజాబ్.. స్టార్ ప్లేయర్ల వికెట్లు కోల్పోతున్నా టార్గెట్ కోసం తీవ్రంగా శ్రమించింది. కానీ, కీలక సమయంలో టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను బెంగళూరు పడగొట్టేసింది. 

పంజాబ్ పని అయిపోయిందనుకుంటున్న సమయంలో ఒక ఓవర్‌కు 27పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే తీవ్రమైన ఒత్తిడితో కనిపిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌కు రావడంతోనే దిగాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో వచ్చీరాగానే సిక్సుతో షాక్ ఇచ్చాడు. ఆ తర్వాతి బంతికే బౌండరీ కోసం ప్రయత్నించగా ఫీల్డింగ్ కాచుకుని కూర్చున్న కోహ్లీ చేతికి బంతి చిక్కింది. 

బంతి అందుకుని వికెట్ పడిన ఆనందంలో కోహ్లీ ఆవేశంగా సైగలు చేశాడు. అది చూసి మైదానం నుంచి ప్రశాంతంగానే బయటకు నడిచిన అశ్విన్.. పెవిలియన్ చేరుకుంటూనే చేతి గ్లౌజులు తీసి విసిరికొట్టాడు. ఆ వీడియోను బీసీసీఐ అధికారిక సైట్‌లో పోస్టు చేసింది.