Ravindra Jadeja : ఇండియన్ మైఖేల్ జాక్సన్ పాటకు.. అమెరికా వీధుల్లో రవీంద్ర జడేజా స్టెప్పులు.. వీడియో వైరల్
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్యాటు, బాల్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తూ టీమ్ఇండియాకు చిరస్మరణీయ విజయాలను అందిస్తున్నాడు.

Ravindra Jadeja dance
Ravindra Jadeja dance : టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్యాటు, బాల్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తూ టీమ్ఇండియాకు చిరస్మరణీయ విజయాలను అందిస్తున్నాడు. మైదానంలో ఎప్పుడు చురుకుగా కనిపించే జడ్డూ తాజాగా తనలోని మరో టాలెంట్‌ను బయటకు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వెస్టిండీస్ పర్యటనకు రవీంద్ర జడేజాకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన కుటుంబంతో కలిసి జడేజా అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను జడ్డూ ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ షేర్ చేసింది. ఈ వీడియోలో జడేజా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.
Rohit Sharma : పాకిస్తాన్ బౌలర్లపై ప్రశ్న.. రోహిత్ శర్మ సమాధానం విన్న రితికా ఏం చేసిందంటే..?
ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరుగాంచిన ప్రభుదేవా నటించిన సినిమాలోని ‘ముక్కాల ముక్కాబులా’ పాటకు రవీంద్ర జడేజా డ్యాన్స్ చేశాడు. తనదైన స్టెప్పులతో అలరించాడు. ఈ వీడియో షేర్ చేసిన సీఎస్‌కే జీవితం మీకు సోమవారాలను ఇస్తే రవీంద్రుడి లాగా మార్చుకోండి అంటూ రాసుకొచ్చింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
జడేజాతో పాటు ధోని కూడా ఉండి డ్యాన్స్ చేసి ఉంటే ఆ మజానే వేరు అంటూ ఓ నెటీజన్ అనగా, క్రికెట్‌లోనే కాదు డ్యాన్స్ కూడా ఇరగదీశావు అంటూ మరొకరు అన్నారు.
Manoj Tiwary : తూచ్.. రిటైర్‌మెంట్ కావట్లే.. వెనక్కి తగ్గిన మనోజ్ తివారి..!
View this post on Instagram