టీమిండియా క్రికెటర్ తండ్రి రాజకీయాల్లోకి..

టీమిండియా క్రికెటర్ తండ్రి రాజకీయాల్లోకి..

Updated On : April 14, 2019 / 2:54 PM IST

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తున్న రాజకీయ పార్టీలు.. క్రికెటర్లపై కన్నేశాయి. వారి క్రేజ్‌ను సొంతం చేసుకోవాలనే యోచనలో ఇప్పటికే  బీజేపీ కండువా కప్పి టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌ను పార్టీలో చేర్చుకుంది. బీజేపీ ఏమీ తీసిపోమంటూ కాంగ్రెస్ కూడా మరో భారత జట్టు క్రికెటర్‌ కుటుంబంపై కన్నేసింది. 

టీమిండియా క్రికెట్‌లో స్థానాన్ని సుస్థిరం చేసుకుని.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆల్ రౌండర్‌గా వెలిగిపోతున్న రవీంద్ర జడేజా తండ్రిని కాంగ్రెస్‌లో జాయిన్ చేసుకుంది. అయితే జడేజా కుటుంబానికి రాజకీయాలు కొత్తేం కాదు. కొద్ది నెలల ముందే రవీంద్ర జడేజా భార్య రివా సోలంకి బీజేపీలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని గుజరాత్ స్థానిక మీడియా టీవీ9 గుజరాతీ నిర్థారించింది. 

క్రికెటర్లు నేరుగా రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పాకిస్తాన్‍‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మాట అటుంచితే, భారత క్రికెటర్లు మొహమ్మద్ అజారుద్దీన్, నవజోత్ సింగ్ సిద్ధు, మొహమ్మద్ కైఫ్‌లు ఇటీవలే రాజకీయాల్లోకి చేరారు.