RCBvsCSK: కీలక పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

సొంతగడ్డపై జరగనున్న కీలకపోరులో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్ధమైంది. ఈ క్రమంలో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి బెంగళూరుది. మరో వైపు గత మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
ఏప్రిల్ 17 ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు చెన్నై జట్టులో లేడు. అయితే చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్‌లో ధోనీ వ్యూహ రచనకు ధీటుగా కోహ్లీ దూకుడు చూపిస్తాడా అనేది చూడాల్సిందే.
చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, కేదర్ జాదవ్, డేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్,
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: పార్థివ్ పటేల్, విరాట్ కోహ్లీ, డివిలియర్స్, అక్షదీప్ సింగ్, మొయిన్ అలీ, మార్కస్ స్టోనిస్, పవన్ నేగీ, డేల్ స్టెయిన్, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్