World T20I team top-5: ప్రపంచంలో టాప్-5 టీ20 ఆటగాళ్ళు ఎవరో చెప్పిన రికీ పాంటింగ్.. అందులో ఇద్దరు మనవాళ్ళే..

ప్రపంచంలోనే అత్యుత్తమ టాప్-5 టీ20 ఆటగాళ్ళు ఎవరన్న ప్రశ్నకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించారు. ఆయన చెప్పిన ఐదుగురి పేర్లలో భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు. ప్రపంచ టీ20 జట్టును ఎంపిక చేస్తే అందులో టాప్-5గా ఎవరు ఉంటారన్న ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో రికీ పాంటింగ్ ఈ సమాధానం చెప్పారు. టాప్ 1గా అఫ్గానిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్ ఉంటాడని అన్నారు.

World T20I team top-5: ప్రపంచంలో టాప్-5 టీ20 ఆటగాళ్ళు ఎవరో చెప్పిన రికీ పాంటింగ్.. అందులో ఇద్దరు మనవాళ్ళే..

Ricky Ponting

Updated On : September 5, 2022 / 9:22 PM IST

World T20I team top-5: ప్రపంచంలోనే అత్యుత్తమ టాప్-5 టీ20 ఆటగాళ్ళు ఎవరన్న ప్రశ్నకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించారు. ఆయన చెప్పిన ఐదుగురి పేర్లలో భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు. ప్రపంచ టీ20 జట్టును ఎంపిక చేస్తే అందులో టాప్-5గా ఎవరు ఉంటారన్న ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో రికీ పాంటింగ్ ఈ సమాధానం చెప్పారు. టాప్ 1గా అఫ్గానిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్ ఉంటాడని అన్నారు.

ప్రస్తుతం రషీద్ ఖాన్ ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో మూడవ స్థానంలో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజాం ఉంటాడని రికీ పాంటింగ్ చెప్పారు. ప్రస్తుతం బాబర్ అజాం ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే, మూడో స్థానంలో భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా ఉంటాడని రికీ పాంటింగ్ అన్నారు.

ఐసీసీ టీ20 ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం పాండ్యా ఐదో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఒపెనర్ జోస్ బట్లర్ నాలుగో స్థానంలో ఉంటాడని రికీ పాంటింగ్ అంచనా వేశారు. ప్రస్తుతం బట్లర్ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 16వ స్థానంలో ఉన్నాడు. ఇక రికీ పాంటింగ్ చెప్పిన టాప్-5 టీ20 ఆటగాళ్ళ జాబితాలో ఐదో స్థానంలో భారత బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఉన్నాడు. టాప్-5 ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం బుమ్రా 37వ స్థానంలో ఉన్నాడు.

China vs America: చైనా-అమెరికా పరస్పరం సైబర్ దాడులు?.. అగ్రరాజ్యంపై మళ్ళీ మండిపడ్డ డ్రాగన్