Rinku Singh: వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టడంపై రింకు సింగ్ ఏమన్నాడంటే..?

చివరి ఓవర్లో భారీ లక్ష్యం ఉన్నప్పటికీ.. నేను సాధించగలను అనే భావతోనే ఉన్నాను. ప్రతీ బాల్ సిక్స్ కొట్టగొలను అనే నమ్మకంతో ఆడాను. అయితే, వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టేందుకు పెద్దగా కష్టపడకపోయినా.. ఐదో సిక్స్ కొట్టే సమయంలో కొంచెం కష్టపడాల్సి వచ్చింది.

Rinku Singh: వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టడంపై రింకు సింగ్ ఏమన్నాడంటే..?

Rinku Singh

Rinku Singh: ఐపీఎల్ 2023 సీజన్ లో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదివారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఎవరూ ఊహించని రీతిలో రింకు సింగ్ వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివరి ఓవర్లో ఐదు బాల్స్ కు 29 పరుగులు కొట్టాల్సి ఉండగా.. వరుసగా ఐదు సిక్స్ లు కొట్టి రింకు ప్రత్యర్థి జట్టుకు పీడకలను మిగిల్చాడు. ఐపీఎల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఇన్నింగ్స్ ఆడటంపై రింకు సింగ్ మాట్లాడాడు. తన ఈ అద్భుత ఇన్నింగ్స్ కు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సిక్స్ లను అంకితం చేస్తున్నట్లు రింకు చెప్పాడు.

Rinku Singh: ఒకే ఓవర్లో ఐదు సిక్సులు కొట్టిన రింకు సింగ్.. చిన్నతనంలో తండ్రిచేత దెబ్బలు తినేవాడట.. ఎందుకంటే?

చివరి ఓవర్లో భారీ లక్ష్యం ఉన్నప్పటికీ.. నేను సాధించగలను అనే భావతోనే ఉన్నాను. ప్రతీ బాల్ సిక్స్ కొట్టగొలను అనే నమ్మకంతో ఆడాను. అయితే, వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టేందుకు పెద్దగా కష్టపడకపోయినా.. ఐదో సిక్స్ కొట్టే సమయంలో కొంచెం కష్టపడాల్సి వచ్చింది. చివరి సిక్స్ ను బ్యాక్ ఫుట్ మీద కొట్టేందుకు కష్టపడాల్సి వచ్చిందని రింకు చెప్పాడు. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న చిన్నచిన్న పనులు చేస్తూ కుటుంబ పోషణకు ఎంతో కష్టపడ్డారు. అందుకే నాకోసం త్యాగాలు చేసిన వారందరికీ ఈ మ్యాచ్‌లో ప్రతీ సిక్స్‌నూ అంకితమిస్తున్నా అంటూ రింకు తెలిపారు.

IPL 2023, GT VS KKR: న‌మ్మ‌శ‌క్యం కాని రింకు సింగ్ బ్యాటింగ్‌.. ఐదు బంతుల‌కు 5 సిక్స‌ర్లు.. కోల్‌క‌తా సంచ‌ల‌న విజ‌యం

రింకు బ్యాటింగ్ పై కేకేఆర్ సారథి నితీష్ రానా మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ మాకు లభించిందంటే అతని వల్లనే. రింకు తొలి రెండు సిక్సులు కొట్టిన తరువాత మాకు విజయంపై నమ్మకం వచ్చింది. మూడో సిక్స్, నాల్గో సిక్స్.. ఐదో సిక్స్ ఇలా మ్యాచ్ అద్భుతంగా సాగింది. రింకు ఆడిన ఈ ఇన్సింగ్స్ గురించి మాటలు లేవు అంటూ పేర్కొన్నాడు.