Rishabh Pant : రీ ఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రిషబ్ పంత్.. వీడియో వైరల్
భారత జట్టులోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) చెమటోడ్చుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ఫిట్‌నెస్ సాధించే పనిలో నిమగ్నమై ఉన్నాడు.

Rishabh Pant workout
Pant : భారత జట్టులోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) చెమటోడ్చుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ఫిట్‌నెస్ సాధించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న పంత్ కఠినమైన వ్యాయామాలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంత్ ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉన్నాడు. తాజాగా ఈ విధ్వంసకర ఆటగాడు ఓ వీడియోను షేర్ చేశాడు.
Jasprit Bumrah : తండ్రైన జస్‌ప్రీత్ బుమ్రా.. చిన్నారి పేరేంటో తెలుసా..?
ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. చిమ్మచీకటిగా ఉండే టన్నెల్‌లో సైతం కొంచెం వెలుగును చూస్తున్నా.. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు అంటూ పంత్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంత్ నువ్వు త్వరలోనే జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తావు. నీ రాక కోసం ఎంతో వెయిట్ చేస్తున్నాం. అంటూ నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Virat Kohli : కోహ్లి కోసమే వచ్చా.. నా గుండె పగిలిపోయిందన్న పాక్ యువతి.. వీడియో వైరల్
గతేడాది డిసెంబర్‌లో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి మోకాలికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. కొద్దిగా కోలుకున్న తరువాత పంత్ ఎన్‌సీఏకి వచ్చాడు. గత కొన్నాళ్లుగా అక్కడే ఉంటూ ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. గాయం కారణంగా పంత్ ఇప్పటికే ఐపీఎల్, ఆసియాకప్ లకు దూరం కాగా ప్రపంచకప్ కూడా ఆడే అవకాశాలు లేవు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ నాటికి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
View this post on Instagram