వరల్డ్ కప్ నాటికి పంత్ ఫిట్ అవ్వాల్సిందే: గంగూలీ

మరి కొద్దిరోజుల్లో ఐసీసీ వరల్డ్ కప్ 2019 జరగనున్న క్రమంలో భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ పైనే అందరి కళ్లు ఉన్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం పంత్ టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమంటూ ప్రశంసలు కురిపించాడు. 5 ఇన్నింగ్స్ లుగా 1, 3, 28, 40(నాటౌట్), 4 అంతగా రాణించలేకపోతుండటంతో ఇంకాస్త అనుభవం వస్తే బాగుంటుందని వ్యక్తమవుతోన్న అభిప్రాయాలకు బలం చేకూర్చాడు. ప్రస్తుతం టీమిండియా ఆసీస్ తో ఆడుతోన్న ఐదు వన్డేల సిరీస్ లో పంత్ చోటు దక్కించుకున్నాడు.
‘పంత్.. ఫిట్ కావాల్సి ఉంది. అప్పటి వరకూ ఫిట్ అవుతాడా అనేది నాకు అనుమానంగానే అనిపిస్తోంది. అది అతనికి వచ్చే అవకాశాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ, టీమిండియా భవిష్యత్ ఆశాకిరణం అని మాత్రం కచ్చితంగా చెప్పగలను’ అని కోల్ కతా మీడియా సమావేశంలో వెల్లడించాడు.
‘కానీ, ఐసీసీ వరల్డ్ కప్ 2019 అంటే మనం వరల్డ్ కప్ లో ఎలా ఆడామనే. ఐపీఎల్ అనేది పూర్తిగా డిఫరెంట్ టోర్నమెంట్. ఈ లీగ్ ప్రదర్శనపైన ఆధారపడి టీమిండియా సెలక్షన్ ఉండద’ని కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పిన సంగతి గంగూలీ గుర్తు చేశాడు.
ఈ సారి వరల్డ్ కప్ చాలా పటిష్టంగా అనిపిస్తోంది. ఎందుకంటే, చాలా జట్లు అంతే ధాటిగా కనిపిస్తున్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు ఇంగ్లాండ్ పర్యటనలో చాలా బాగా రాణించాయి. దక్షిణాఫ్రికా జట్టు మీద విజయం పొందిన తర్వాత శ్రీలంకపైన కూడా ఆశలు పెరిగాయి. ఈ సారి వరల్డ్ కప్ మరింత టఫ్ గా ఉండనుంది’ అని గంగూలీ పేర్కొన్నారు.