షాకింగ్.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ ఆడడు
అతడి ఆటను ఇక ఫ్యాన్స్ ఐపీఎల్, వన్డేల్లో మాత్రమే చూడగలుగుతారు.

Rohit Sharma
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను సెలెక్టర్లు తొలగిస్తున్నట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే రోహిత్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నానంటూ రోహిత్ శర్మ తెలిపాడు. తనకు కెరీర్‌లో సపోర్టుగా ఉన్న వారందరికీ థ్యాంక్స్ చెప్పాడు.
ఇక అతడిని వచ్చే నెల ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు మ్యాచులోనూ చూడలేం. రోహిత్ శర్మ తన కెరీర్‌లో మొత్తం 67 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. వాటిల్లో 12 సెంచరీలు, 18 అర్థ సెంచరీలతో మొత్తం 4,301 పరుగులు చేశాడు. రోహిత్ ఇంతకు ముందు ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడి ఆటను ఇక ఫ్యాన్స్ ఐపీఎల్, వన్డేల్లో మాత్రమే చూడగలుగుతారు.
రోహిత్ శర్మ టెస్టుల్లోకి 2013లో అరంగేట్రం చేశాడు. అతడి కెప్టెన్సీలో భారత జట్టు రెండుసార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఫైనల్ వరకు వెళ్లింది. తదుపరి సారథ్య బాధ్యతలు జస్‌ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లో ఒకరు చేపట్టే అవకాశం ఉంది.