రోహిత్ ఫైర్.. బుర్ర పెట్టి ఆడాలని సైనీకి సెటైర్

తాను కూడా మిస్టర్ కూల్ అని చెప్పుకుంటూ తిరిగే టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. భారత బౌలర్ నవదీప్ సైనీపై వ్యంగ్యంగా ప్రవర్తించాడు. విరాట్ కోహ్లీ నేరుగా మైదానంలోనే ప్లేయర్లపై విరుచుకుపడి మళ్లీ దగ్గరకి తీసుకుంటాడు. కానీ, రోహిత్ స్టైల్ వేరు. కెప్టెన్‌గా వ్యవహరించినంత సేపు ఒత్తిడికి లోనైనట్లుగా కనిపిస్తూ ప్లేయర్లకు స్వేచ్ఛను ఇస్తాడు.
కానీ, ఆదివారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మూడో టీ20లో రోహిత్ అసహనంగా కనిపించాడు. నవదీప్ సైనీ బౌలింగ్‌లో వరుస బౌండరీలు వెళ్తుండటంతో కాస్త బుర్ర పెట్టి ఆడు అన్నట్లుగా సైగలు చేశాడు. ఈ వీడియో కాస్త నెట్టింట్లో వెళ్లడంతో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.
అసలేం జరిగిందంటే:
విరాట్ కోహ్లి మైదానం విడిచి వెళ్లడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలను తాత్కాలికంగా చేపట్టాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ వేస్తుండగా 12వ ఓవర్ ఐదో బంతిని సైనీ లెగ్ స్టంప్‌పైకి ఫుల్‌టాస్‌గా విసిరాడు. దానిని సునాయాసంగా ఎదుర్కొన ఉన్న బావుమా ఫోర్‌తో సమాధానమిచ్చాడు. వరుసగా సైనీ బౌలింగ్‌లో బావుమా కొట్టిన రెండో ఫోర్ అది. అంతకుముందు బంతిని ఎక్స్‌ట్రా కవర్ మీదుగా ఫోర్‌గా కొట్టాడు.
పాపం మ్యాచ్ గెలిపించాలనే ఆరాటంలో ఉన్న రోహిత్‌కు ఆ విషయం ఆవేశం తెప్పించింది. బుర్ర పెట్టి బౌలింగ్ చేయమంటూ సైనీకి సైగలు చేసి చూపించాడు. చివరికి భారత్ 9వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. రెండు ఓవర్లు వేసిన సైనీ ఒక్క వికెట్ పడగొట్టకుండానే 25 పరుగులు సమర్పించుకున్నాడు.
— Liton Das (@BattingAtDubai) September 24, 2019