Rohit Sharma : అయ్యో రోహిత్‌శ‌ర్మ‌కు ఎన్ని క‌ష్టాలో.. అభిమానుల నుంచి త‌ప్పించుకునేందుకు ప‌రుగులు..! వీడియో

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Rohit Sharma : అయ్యో రోహిత్‌శ‌ర్మ‌కు ఎన్ని క‌ష్టాలో.. అభిమానుల నుంచి త‌ప్పించుకునేందుకు ప‌రుగులు..! వీడియో

Rohit Sharma Avoids Fans, Runs Away From Them In Mumbai Indians Training Ground

Updated On : October 10, 2024 / 11:00 AM IST

Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న విధ్వంస‌క‌ర ఆట‌తీరుతో భార‌త్‌లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. టీ20ల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన హిట్‌మ్యాన్ కేవ‌లం వ‌న్డేలు, టెస్టులు మాత్ర‌మే ఆడుతున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ అనంత‌రం రోహిత్ శ‌ర్మ విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఇక న్యూజిలాండ్‌తో అక్టోబ‌ర్ 16 నుంచి భార‌త్ మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ టెస్టు సిరీస్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో రోహిత్ శ‌ర్మ ప్రాక్టీస్ మొద‌లు పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యొక్క శిక్షణా మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ప్రాక్టీస్ అనంత‌రం గ్రౌండ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో పెద్ద సంఖ్య‌లో అభిమానులు అక్క‌డ ఉన్నారు.

Surya Kumar Yadav : హార్దిక్‌కు కావాల‌నే బౌలింగ్ ఇవ్వ‌లేదు.. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి ఓ అద్భుతం : కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌

అయితే.. వారి నుంచి త‌ప్పించుకునేందుకు రోహిత్ శ‌ర్మ ప‌రుగెత్తుకుంటూ త‌న కారు వ‌ద్ద‌కు వ‌చ్చాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇదిలా ఉంటే.. చివ‌రి సారి న్యూజిలాండ్ 2021లో భార‌త్‌లో ప‌ర్య‌టించింది. రెండు మ్యాచుల సిరీస్‌ను భార‌త్ 0-1తో గెలుచుకుంది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ ఫైన‌ల్ నేప‌థ్యంలో ప్ర‌తి టెస్టు మ్యాచ్ భార‌త్‌కు కీల‌క‌మే. డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ ప్ర‌స్తుతం అగ్ర‌స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌నున్న మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌ను గెలుచుకుని త‌న స్థానాన్ని మ‌రింత సుస్థిరం చేసుకోవాల‌ని టీమ్ఇండియా భావిస్తోంది.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్ద పట్టిన అద్భుత క్యాచ్ చూశారా.. వీడియో వైరల్