వైజాగ్ టెస్టు : రోహిత్ సిక్సర్ల మోత.. ద్రవిడ్, నవజ్యోత్ రికార్డులు బ్రేక్

  • Published By: sreehari ,Published On : October 5, 2019 / 09:52 AM IST
వైజాగ్ టెస్టు : రోహిత్ సిక్సర్ల మోత.. ద్రవిడ్, నవజ్యోత్ రికార్డులు బ్రేక్

Updated On : October 5, 2019 / 9:52 AM IST

టెస్టు క్రికెట్ లో తొలిసారి ఓపెనర్ గా అరంగేట్రం చేసిన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఓపెనర్ గా రోహిత్ (176) సెంచరీతో అదరగొట్టాడు. తద్వారా టెస్టు క్రికెట్ లో ఓపెనర్ గా తొలి సెంచరీ నమోదు చేసిన భారత 4వ బ్యాట్స్ మెన్ గా రోహిత్ నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే దూకుడును కొనసాగిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ బాదిన రోహిత్.. శనివారం రెండో ఇన్నింగ్స్ లో కూడా సిక్సర్ల మోత మోగించాడు.

భారత్ రెండో ఇన్నింగ్స్ లో 20వ ఓవర్ వద్ద రోహిత్ తన 6వ సిక్స్ ను బాదేశాడు. భారత్ తరపున జరిగే టెస్టు మ్యాచ్ లో వరుసగా అత్యధిక సిక్స్ లు బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. తద్వారా 1994లో `లక్నోలో నవజ్యోత్ సింగ్ సిద్ధు బాదిన 8 సిక్సుల రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. వైజాగ్ లో తన 9వ సిక్స్ తో.. అన్ని మూడు ఫార్మాట్లలో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు నెలకొల్పాడు.

భారత్ రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన రోహిత్ రాహుల్ ద్రవిడ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. టెస్టు క్రికెట్ లో తన 12వ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ద్రవిడ్ ను వెనక్కి నెట్టాడు. అంతేకాదు.. సొంతగడ్డపై టెస్టుల్లో వరుసగా 50కి పైగా హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ద్రవిడ్ పై ఉన్న రికార్డును కూడా రోహిత్ తిరగ రాశాడు. 1997, 1998లో వరుసగా 6 సార్లు హాఫ్ సెంచరీలు నమోదు చేసి ద్రవిడ్ ఈ రికార్డును నెలకొల్పాడు.