Rohit Sharma : వన్డే ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా తన పేరు ప్రకటించగానే.. రోహిత్ శర్మ రియాక్షన్ చూశారా..?
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం మంగళవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.
Rohit Sharma Reaction : భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం మంగళవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. 15 మంది ఈ జట్టులో చోటిచ్చారు. మెగా టోర్నీకి ఎంపికైన వారి పేర్లను చీఫ్ సెలక్టర్లు అజిత్ అగార్కర్ (Ajit Agarkar), కెప్టెన్ రోహిత్ శర్మ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (Rohit Sharma) ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
World Cup 2023: ఆల్ రౌండర్లతో నిండిపోయిన ఆసీస్.. ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన..
ప్రపంచకప్‌కు ఎంపికైన ఆటగాళ్ల వివరాలను అజిత్ అగార్కర్ వెల్లడించారు. మొదటగా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ పేరును అతడు చెప్పాడు. తన పేరు విన్న వెంటనే హిట్‌మ్యాన్ ఒక్కసారిగా తన చేతిని పై కెత్తి హే అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్ నువ్వే కదా బాసు.. నీ పేరు లేకుండా ఎలా ఉంటుంది చెప్పు అంటూ ఓ నెటీజన్ కామెంట్ చేయగా, ప్రపంచకప్ గెలిచి కానుకగా ఇవ్వాలని మరో నెటీజన్ అన్నారు.
Virender Sehwag : వన్డే ప్రపంచకప్‌లో ఆటగాళ్ల జెర్సీలపై.. ఇండియా అని కాకుండా..
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే ఐసీసీ ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆయా మ్యాచులకు సంబంధించిన టికెట్లు కూడా ఆన్లైన్లో విక్రయాలకు ఉంచారు. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
ODI World Cup : వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా జట్టు ఇదే.. ఐపీఎల్ హీరోలకు దక్కని చోటు
Team India for World Cup 2023.
Rohit’s reaction 😂 pic.twitter.com/FDh4Ah7uq9
— Cricketopia (@CricketopiaCom) September 5, 2023