రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్ స్టేడియంలోనే కన్నీటితో..

రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్ స్టేడియంలోనే కన్నీటితో..

Updated On : March 13, 2019 / 9:16 AM IST

ఫుట్‌బాల్ వరల్డ్‌లో టాప్ ప్లేయర్.. దిగ్గజ ఆటగాడు క్రిస్టియానొ రొనాల్డొ హ్యాట్రిక్ గోల్స్ జట్టును భారీ ఆధిక్యంతో గెలిపించాడు. మ్యాచ్ చూడడానికి వచ్చిన అతని గర్ల్ ఫ్రెండ్ జార్జినా రొడ్రిగేజ్‌కు ఆనందంతో కళ్లు చెమ్మగిల్లాయి. చాంపియన్ లీగ్ క్వార్టర్ ఫైనల్‌లో రొనాల్డో ఆడుతున్న జ్యూవెంటస్ జట్టు అట్లెటికొ మాడ్రిడ్‌పై తలపడేందుకు సిద్ధమైంది.

మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో జ్యూవెంటస్ జట్టు 3 గోల్స్ చేసి అట్లెటికొ మాడ్రిడ్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన రొనాల్డొను చూసిన అతని గర్ల్ ఫ్రెండ్ మైదానంలోనే భావోద్వేగానికి గురైంది. కన్నీటితో తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. 
Read Also : పాక్ ప్రజల జీవితాల్ని మార్చేస్తున్న అభినందన్ ఫొటో

ఆ సన్నివేశాన్ని తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో పోస్టు చేసి ఇలా కామెంట్ చేసింది.’3-0స్కోరును ఎవ్వరూ చెరపలేరు. ఇది నీ అంకితభావానికి నిదర్శనం. జట్టు కోసం పడిన కష్టం వృథాగా పోదు. జట్టు సహచరులకు నువ్వొక ట్రైలర్ లాంటి వాడివి. కోచ్‌తో పాటు ఈ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. దేవుడికి తెలుసు  నీకేం ఇవ్వాలో. ప్రపంచ ఫుట్‌బాల్ నీదే. క్రిస్టియానిటో, మాటో, అలానా, జార్జినా మీరంటే మాకెంతో ఇష్టం’ అని భావోద్వేగపూరితంగా కామెంట్ చేసింది. 

మ్యాచ్ అనంతరం మాట్లాడిన రొనాల్డొ.. ‘ఈ రోజు మాకెంతో ప్రత్యేకం. అంటే గోల్స్ గురించి కాదు. జట్టు బాగా సహకరించింది. మానసికంగా మేము చాంపియన్స్. జ్యూవెంటస్ నన్ను కొనుగోలు చేసిందానికి అర్థం ఇదే’ అని తెలిపాడు.