RRvsDC: ఢిల్లీ టార్గెట్ 192

RRvsDC: ఢిల్లీ టార్గెట్ 192

Updated On : April 22, 2019 / 4:24 PM IST

రాజస్థాన్ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. అజింకా రహానె సత్తా చాటాడు. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లకు 6వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేయగలిగింది. కెప్టెన్సీ నుంచి తప్పించిన రెండో మ్యాచ్‌లో (105; 63బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సులు)తో చెలరేగి జట్టుకు చక్కటి స్కోరు అందించాడు.

మరో ఓపెనర్ సంజూ శాంసన్(0)డకౌట్ అయినప్పటికీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(50; 32బంతుల్లో 8ఫోర్లు)కు మంచి భాగస్వామ్యం అందించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్(8), ఆష్టన్ టర్నర్(0), స్టువర్ట్ బిన్నీ(19), రియాన్ పరాగ్(4)లతో సరిపెట్టుకున్నారు.

ఢిల్లీ బౌలర్లు ఇషాంత్ శర్మ, అక్సర్ పటేల్, క్రిస్ మోరిస్ తలో వికెట్ తీయగా, రబాడ 2వికెట్లు పడగొట్టాడు.