RRvsKKR: రాజస్థాన్ పై ఘన విజయం సాధించిన నైట్ రైడర్స్

రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ అత్యల్పంగా 140పరుగుల టార్గెట్ ను నమోదు చేసింది. చేధనలో ఆరంభం నుంచి దూకుడు కనబరిచిన కోల్ కతా 2వికెట్లు నష్టపోయి 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు సగానికి పైగా మ్యాచ్ ను పూర్తి చేయగా మిగిలిన మ్యాచ్ ను రాబిన్ ఊతప్ప(26), శుభ్ మన్ గిల్(6) ఆడేశారు.
జట్టులో అత్యధిక స్కోరు నమోదు చేసిన ప్లేయర్లుగా క్రిస్ లిన్(50; 32 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు), సునీల్ నరైన్(47; 25 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు)తో కీలకమైన స్కోరును అందించారు.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ను కట్డడి చేయడంలో నైట్ రైడర్స్ బౌలర్లు చక్కటి ప్రతిభ కనబరిచారు. అయినప్పటికీ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీకి మించిన స్కోరుతో ఆకట్టుకున్నాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి క్రీజులో స్టీవ్ స్మిత్( 73), బెన్ స్టోక్స్(7) పరుగులు చేశారు.
ఓపెనర్ గా దిగిన కెప్టెన్ రహానె కేవలం 5 పరుగులతో నిరాశపరచగా, మరో ఎండ్ లో దిగిన జోస్ బట్లర్(37)చేశాడు. నాలుగో వికెట్ గా దిగిన రాహుల్ త్రిపాఠీ(6)పరుగులతోనే ముగించాడు. కోల్ కతా బౌలర్లలో ప్రసిద్ కృష్ణా(1), హ్యారీ గర్నీ(2)వికెట్లు తీయగలిగారు.