COVID-19 నియంత్రణకు ధోనీ లక్ష, సచిన్ రూ.50లక్షలు సాయం

COVID-19 నియంత్రణకు ధోనీ లక్ష, సచిన్ రూ.50లక్షలు సాయం

Updated On : March 27, 2020 / 9:13 AM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ పంజా విసురుతుంది. ఈ చైన్‌కు బ్రేక్ వేసేందుకు ప్రముఖులంతా కదిలి వస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, క్రికెట్, క్రీడా ప్రతినిధులు ఇలా లక్షల్లో విరాళాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 14వరకూ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఆర్థికంగా సాయం చేస్తున్నారు. 

మహేంద్ర సింగ్ ధోనీ లక్ష రూపాయలు విరాళమివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టేడియంలో అభిమానులు వచ్చి కాళ్లు మొక్కే ధోనీ లక్షయేనా ఇచ్చేదంటూ నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోలా చూస్తే ధోనీ ఇచ్చినట్లు పబ్లిసిటీ చేసుకోలేదు. ఇంకా వేరే విధంగా డొనేట్ చేశాడో లేదో క్లారిటీ కూడా లేదు. రూ.800 కోట్ల సంవత్సర ఆధాయం వచ్చే ధోనీ విరాళంపై చర్చ నడుస్తుండటం మాత్రం ఆశ్చర్యమే.

కెట్టో వెబ్ సైట్ ద్వారా పూణెలో ఉన్న ముకుల్ మాధవ్ ఫౌండేషన్‌కు కోటి ఇచ్చినట్లు మాత్రం అధికారిక సమాచారం. ఆ ఫౌండేషన్ 12.5లక్షలను పోగు చేసి విరాళమిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే రూ.12లక్షలు పోగు చేసింది. ఆ విరాళంలో ధోనీ కూడా పాలుపంచుకున్నాడు. 

బీసీసీఐ ప్రెసిడెంట్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రూ.50లక్షలు విలువ చేసే బియ్యాన్ని పేద కుటుంబాలకు పంపిణీ చేశాడు. ఇక ఇరాన్, యూసఫ్ పఠాన్లు ఉడత సాయంగా ఫేస్ మాస్క్ లు డొనేట్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ రిలీఫ్ ఫండ్ కు శిఖర్ ధావన్ కూడా డొనేట్ చేశాడు. కానీ, అదెంత మొత్తమో చెప్పుకుండా హుందాతనాన్ని పాటించాడు. 

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. మనమంతా ప్రశాంతంగా ఉండాలని అలాగే కరోనాను ఎదుర్కోగలమని సూచనలిచ్చాడు. టెస్టు క్రికెట్ లోనూ  మా ప్రధాన ఆయుధం ఇదే అని చెప్పాడు. షార్ట్ ఫార్మాట్ ను నమ్ముకోకుండా.. టెస్టు క్రికెట్ పార్టనర్ షిప్ మాదిరి ప్రశాంతంగా టీం వర్క్ చేసి కరోనాను పారద్రోలాలని పిలుపునిచ్చాడు. 

See Also | క్వారంటైన్ నుంచి యువ IAS అదృశ్యం