Sai Sudharsan : ఆటలోనే కాదు.. సంపాదన పరంగా కూడా.. సాయి సుదర్శన్ ఆస్తి ఎంతో తెలుసా?
గుజరాత్‌కు చెందిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ రక్తంలోనే క్రీడలు ఉన్నాయి.

Sai Sudharsan salary net worth Family details
అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించడంలో సాయి సుదర్శన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న అతడు 82 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
గుజరాత్‌కు చెందిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ రక్తంలోనే క్రీడలు ఉన్నాయి. అతడి తండ్రి, తల్లి భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. సాయి సుదర్శన్ తండ్రి ఆర్.భరద్వాజ్ ఒక అథ్లెట్. ఢాకాలో జరిగిన దక్షిణాసియా క్రీడలలో అతను భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. అతని తల్లి ఉషా భరద్వాజ్ జాతీయ వాలీబాల్ స్థాయిలో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించారు.
సాయి సుదర్శన్ కు ఎంత ఆస్తి ఉంది?
2023 డిసెంబర్ 17న దక్షిణాఫ్రికాపై అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు సాయి సుదర్శన్. టీమ్ఇండియా తరుపున మూడు వన్డేలు ఆడాడిన అతడి మొత్తం నికర విలువ దాదాపు రూ. 8.5 కోట్లు.
2022లో జరిగిన ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023లో 362 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 47 బంతుల్లో 96 పరుగులు చేయడంతో రాత్రికి రాత్రే అతడు స్టార్ మారిపోయాడు.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన రికార్డు కూడా సాయి పేరిట ఉంది. అతని ప్రదర్శనల కారణంగా ఐపీఎల్ 2025 వేలంలో గుజరాత్ టైటాన్స్ అతన్ని రూ. 8.5 కోట్లకు నిలుపుకుంది. అతడు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడుతున్నాడు. అతని దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇందులో లంబోర్గిని హురాకాన్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, BMW X5 ఉన్నాయి. అతను నైక్, కోకా-కోలా, పెప్సిలకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లను కలిగి ఉన్నాడు.