Sanju Samson: సెల్పీ దిగుతున్న సమయంలో అభిమాని ఫోన్‌కు కాల్.. సంజూ శాంసన్ చేసిన పనికి అందరిలోనూ ఆశ్చర్యం..
క్రికెటర్ సంజూ శాంసన్ ఓ అభిమాని వద్ద నుంచి ఫోన్ తీసుకొని సెల్ఫీ దిగుతుండగా ఫోన్ వచ్చింది. అయితే, ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన సంజూ అందరిని ఆశ్చర్యపర్చాడు.

Sanju Samson
Sanju Samson: ఐపీఎల్ – 2023 సీజన్‌లో జట్ల మధ్య మ్యాచ్‌లు ఉత్కంఠ భరింతంగా సాగుతున్నాయి. చివరి ఓవర్ వరకు గెలుపు ఏ జట్టుదో తేల్చుకోలేని పరిస్థితి. ఉత్కంఠ భరింతంగా సాగే మ్యాచ్‌లతో క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నాయి. గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభం సమయంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ అభిమానులతో సెల్పీలు దిగాడు. ఈ క్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
IPL 2023, RR vs CSK: చెన్నైకి షాక్.. వరుస విజయాలకు బ్రేక్.. రాజస్థాన్ గెలుపు
క్రికెటర్ సంజూ శాంసన్ ఓ అభిమాని వద్ద నుంచి ఫోన్ తీసుకొని సెల్ఫీ దిగుతుండగా ఫోన్ వచ్చింది. అయితే ఫోన్ కట్‌చేసి, సెల్ఫీ దిగకుండా ఆ ఫోన్ లిఫ్ట్ చేసి సంజూ శాంసన్ సమాధానం ఇచ్చాడు. హా చెప్పండి భయ్యా ఏం జరుగుతుంది అంటూ పలుకరించాడు. దీంతో ఫ్యాన్స్ కేకలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. దీంతో సంజూను అభినందిస్తూ పలువురు కామెంట్స్ చేశారు. అభిమానులు అంటే సంజూకు ఎంత ప్రేమ అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
ఐపీఎల్ 2023 సీజన్ లో శాంసన్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాధించింది. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐదు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది.
Calls > Text because you never know, Sanju Samson might just pick up ?? pic.twitter.com/fJwGMbvmt2
— Rajasthan Royals (@rajasthanroyals) April 26, 2023