Shikhar Dhawan : శిఖ‌ర్ ధావ‌న్ గాయం టీమ్ఇండియా కొంప‌ముంచింది..! లేదంటే అప్పుడే ప్ర‌పంచ‌క‌ప్ వ‌చ్చేది..!

టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు.

Shikhar Dhawan : శిఖ‌ర్ ధావ‌న్ గాయం టీమ్ఇండియా కొంప‌ముంచింది..! లేదంటే అప్పుడే ప్ర‌పంచ‌క‌ప్ వ‌చ్చేది..!

Shikhar Dhawan smashed 117 against Australia with a fractured thumb in 2019 ODI World Cup

Shikhar Dhawan retirement : టీమ్ఇండియా స్టార్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు శ‌నివారం వీడ్కోలు పలికాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని తెలియ‌జేశాడు. భార‌త జ‌ట్టుకు సుదీర్ఘ కాలం ఆడ‌డం త‌న‌కు సంతృప్తినిచ్చింద‌ని చెప్పుకొచ్చాడు. త‌న‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

ధావన్‌ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అభిమానులు అత‌డి భ‌విష్య‌త్తు మ‌రింత బాగుండాల‌ని కోరుకుంటున్నారు. గ‌బ్బ‌ర్‌ను మిస్ అవుతున్నాం అని పోస్టులు పెడుతున్నారు. అంతేకాదండోయ్ కొంద‌రు అయితే.. శిఖ‌ర్ ధావ‌న్ గ‌నుక గాయంతో త‌ప్పుకోక‌పోయి ఉంటే 2019 వ‌న్డే ప్ర‌పంచ‌కప్‌లో టీమ్ఇండియా విశ్వవిజేత‌గా నిలిచిఉండేద‌ని అంటున్నారు. ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటే ఏకైక భారత బ్యాటర్ శిఖర్ ధావన్ అని, గణంకాలతో సహా వివరిస్తున్నారు.

Shikhar Dhawan : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన శిఖ‌ర్ ధావ‌న్.. ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో ఆసక్తికర విషయాలు వెల్లడి

2013లో భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోపీ గెల‌వ‌డంలో ధావ‌న్ కీల‌క పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో పాటు సెమీఫైనల్, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విష‌యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో ధావ‌న్ సెంచ‌రీ చేశాడు. ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై అత్యంత వేగంగా సెంచ‌రీ చేసిన తొలి ఆసియా ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

అయితే.. ఈ మ్యాచ్ ప్రారంభంలో పాట్ క‌మిన్స్ వేసిన బంతి ధావ‌న్ వేలిని బ‌లంగా తాకింది. నొప్పిని భ‌రిస్తూనే అత‌డు శ‌త‌కం బాదాడు. మ్యాచ్ అనంత‌రం అత‌డికి స్కానింగ్ నిర్వ‌హించ‌గా బొట‌న వేలు విరిగిన‌ట్లు తేలింది. వైద్యుల సూచ‌న మేర‌కు అత‌డు మిగిలిన టోర్నీ నుంచి త‌ప్పుకున్నాడు. అత‌డి స్థానంలో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన కేఎల్ రాహుల్ దారుణంగా విఫ‌లం అయ్యాడు. దీంతో ధావ‌న్ ఉండి ఉంటే.. 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ విజ‌యం సాధించి ఉండేద‌ని ఇప్ప‌టికి ప‌లువురు ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Viral Video : ఈ వీడియో చూసి న‌వ్వ‌కుండా ఉండ‌లేరు.. వీడు క్యాచ్ ప‌ట్టేలోపు అంపైర్ వెకేష‌న్‌కు వెళ్లి రావొచ్చు..