Shreyas Iyer : ఆస్పత్రి నుంచి టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ డిశ్చార్జ్.. కానీ, మరికొన్నాళ్లు అక్కడే..
Shreyas Iyer శ్రేయాస్ అయ్యర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
Shreyas Iyer
Shreyas Iyer : టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయాస్ పక్కటెముకలకు బలమైన గాయమైంది. దీంతో వైద్య సిబ్బంది సహాయంతో అతడు మైదాన్ని వీడాడు. తీవ్ర గాయం కావడంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు.
తాజాగా శ్రేయాస్ అయ్యర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం కుదటపడింది. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. ఈ సందర్భంగా సిడ్నీ డాక్టర్ కొరొష్ హగిగి, అతడి వైద్య బృందానికి, అదేవిధంగా భారత్‌కు చెందిన డాక్టర్ దిన్షా పార్దీవాలాకు బీసీసీఐ ధన్యవాదాలు చెప్పింది. శ్రేయాస్ త్వరగా కోలుకునేలా మెరుగైన చికిత్స అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.
శ్రేయాస్ అయ్యర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ కొన్నాళ్లు సిడ్నీలోనే ఉండనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. విమాన ప్రయాణం చేయొచ్చునని వైద్యులు చెప్పిన తరువాతే శ్రేయాస్ భారతదేశానికి తిరిగి రానున్నాడు.
🚨 Medical update on Shreyas Iyer
The BCCI Medical Team, along with specialists in Sydney and India, are pleased with his recovery, and he has been discharged from the hospital today.
Details 🔽 | #TeamIndia https://t.co/g3Gg1C4IRw
— BCCI (@BCCI) November 1, 2025
తన గాయంపై సోషల్ మీడియా వేదికగా శ్రేయాస్ అయ్యర్ రెండ్రోజుల క్రితం స్పందించారు. ‘ప్రస్తుతం కోలుకుంటున్నాను. రోజురోజుకు మరింత మెరుగ్గా అనిపిస్తుంది. క్లిష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు’. అని శ్రేయాస్ పేర్కొన్నారు.
— Shreyas Iyer (@ShreyasIyer15) October 30, 2025
