శుభ్‌మన్ గిల్ తండ్రి, సోదరి ఎమోషనల్.. హగ్ చేసుకుని, ముద్దు పెట్టి..

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఫస్ట్ విన్ సాధించడంతో అతడి ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషనల్ అయ్యారు.

శుభ్‌మన్ గిల్ తండ్రి, సోదరి ఎమోషనల్.. హగ్ చేసుకుని, ముద్దు పెట్టి..

Shubman Gill: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్‌గా తొలి విజయాన్ని అందుకున్నాడు యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్. తాజా ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు పగ్గాలు చేపట్టిన గిల్ ఫస్ట్ మ్యాచ్‌లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. అహ్మదాబాద్‌లోని ఆదివారం రాత్రి నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆరు పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచింది. అటు తొలిసారిగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. రోహిత్ శర్మను పక్కనపెట్టి పాండ్యాకు కెప్టెన్సీ కట్టబెట్టడంతో సోషల్ మీడియాలో హిట్‌మాన్‌ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

తమ కుమారుడు కెప్టెన్‌గా తొలి విజయాన్ని సాధించడంతో శుభ్‌మన్ గిల్ తండ్రి లఖ్వీందర్ సింగ్ ఎమోషనల్ అయ్యారు. తన కమారుడిని గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేశారాయన. అలాగే శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్ కూడా తన బ్రదర్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫస్ట్ మ్యాచ్‌లో విజయం దక్కడంతో శుభ్‌మన్ గిల్ కూడా చాలా హ్యాపీగా కనిపించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో గిల్ 31 పరుగులు చేశాడు.

Also Read: ముంబై ఇండియన్స్ ఓటమి తరువాత హార్దిక్ పై రోహిత్ ఆగ్రహం.. ఆకాశ్ అంబానీ ఏం చేశారంటే?

మార్చి 26న చెపాక్ స్టేడియంతో చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తన రెండో మ్యాచ్ ఆడనుంది. ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించిన సీఎస్కే జోరు మీదుంది. ఇటు గుజరాత్ కూడా ముంబైని ఓడించి బోణి కొట్టింది. రెండో మ్యాచ్‌లోనూ జోరు కొనసాగించాలని రెండు టీమ్‌లు భావిస్తున్నాయి.