Team India : శుభ్ మన్ గిల్‌‌కు గాయం, సిరీస్‌‌కు దూరం ?

టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా..శుభ్‌మన్ గిల్ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

Team India : శుభ్ మన్ గిల్‌‌కు గాయం, సిరీస్‌‌కు దూరం ?

Team India

Updated On : July 1, 2021 / 9:05 PM IST

Shubman Gill : టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా..శుభ్‌మన్ గిల్ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ లో పాల్గొననుంది. ఈ టెస్టుల సిరీస్ కు గిల్ అందుబాటులో ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే..గిల్ గాయంపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

21 ఏళ్ల గిల్…కాలి పిక్క కండరాల్లో గాయంతో బాధ పడుతున్నాడని, తీవ్రత అధికంగా ఉండడంతో ఆపరేషన్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.
ఒకవేళ గిల్ సిరీస్ కు దూరమైతే…ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తోంది టీమిండియా. ఇతని స్థానంలో మయాంక్ అగర్వాల్, కేఎల్ పాల్, రాహుల్, హనుమ విహారిలతో పాటు..అభిమన్యు పేర్లను పరిశీలిస్తోందని సమాచారం.

ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు మరో నెల సమయం ఉంది. దీంతో అప్పటి వరకు గిల్ గాయం నుంచి కొలుకొనే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. గిల్…8 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించారు. 3 హాఫ్ సెంచరీలతో 31.84 సగటుతో 414 పరుగులు చేశఆాడు. టెంట్ బ్రిడ్జిలో ఆగస్టు 04వ తేదీ నుంచి భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.