Ind Vs Nz 3rd ODI: మూడో వన్డేలో స్వల్ప మార్పులు..? ఆ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే యోచనలో రోహిత్

మూడో వన్డేలో తుదిజట్టులో పలు మార్పులు చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక ఆటగాళ్లకు, ముఖ్యంగా బౌలర్లకు విశ్రాంతి ఇస్తారని సమాచారం.

Ind Vs Nz 3rd ODI: మూడో వన్డేలో స్వల్ప మార్పులు..? ఆ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే యోచనలో రోహిత్

Team india

Updated On : January 22, 2023 / 3:20 PM IST

Ind Vs Nz 3rd ODI: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు వన్డేల్లో భారత్ విజయం సాధించింది. మూడో వన్డే 24న ఇండోర్‌లో జరుగుతుంది. రెండు వన్డేల్లో విజయంతో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ జట్టు.. క్లీన్‌స్వీప్ పై కన్నేసింది. అయితే, మూడో వన్డేలో తుదిజట్టులో పలు మార్పులు చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక ఆటగాళ్లకు, ముఖ్యంగా బౌలర్లకు విశ్రాంతి ఇస్తారని సమాచారం.

India vs New zealand ODI Series: ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ రెండో వ‌న్డే.. ఫొటో గ్యాల‌రీ

రెండో వన్డే ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారని, అయితే ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని వారిని పొదుపుగా వాడుకోవాలని భావిస్తున్నామని అన్నాడు. దీంతో మూడో వన్డేలో షమీ, సిరాజ్ ఇద్దరు తుదిజట్టులో ఆడే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. వీరి స్థానంలో ఉమ్రాన్ మాలిక్, షాబాజ్ అహ్మద్‌ను తుది జట్టులో ఎంపికచేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అలాకుదరని పక్షంలో షమీ, సిరాజ్ లలో ఎవరికో ఒకరికి విశ్రాంతి ఇచ్చే అవకశాలు ఉన్నాయి.

India vs New Zealand: భారత్ బౌలర్ల విజృంభణ.. అతితక్కు‌వ స్కోర్‌కే కుప్పకూలిన కివీస్ టాప్ ఆర్డర్

ఇప్పటికే యుజ్వేంద్ర చాహల్‌కు కూడా సిరీస్‌లో అవకాశం లభించలేదు. కుల్దీప్, వాషింగ్టన్ సుందర్‌లలో ఎవరికైనా ఒకరికి విశ్రాంతి ఇవ్వచ్చు. వారి స్థానంలో చాహల్‌కు చోటు కల్పించే అవకాశాలు లేకపోలేదని మాజీలు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి న్యూజిలాండ్‌తో సిరీస్‌ను కైవసం చేసుకోవటంతో మూడో వన్డేలో తుదిజట్టులో కీలక మార్పులే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.