Smriti Mandhana : టీ20ల్లో స్మృతి మంధాన అరుదైన ఘనత.. రెండో భారత మహిళా ప్లేయర్‌గా..
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది.

Smriti Mandhana becomes second Indian woman to play 150 T20I
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించింది.
పురుషుల, మహిళల టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన మూడో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కింది. ఈ జాబితాలో హర్మన్ ప్రీత్ కౌర్, రోహిత్ శర్మలు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా మంధాన ఈ ఘనత సాధించింది. మంధానకు టీమ్ఇండియా తరుపున ఇది 150వ టీ20 మ్యాచ్.
179 టీ20 మ్యాచ్‌లతో హర్మన్ ప్రీత్ అగ్రస్థానంలో ఉండగా, 159 మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండో ఉన్నాడు.
ఇక మహిళల క్రికెట్‌లో అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన జాబితాలో మంధాన ఏడో స్థానంలో నిలిచింది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ 179 మ్యాచ్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత వరుసగా సుజీ బేట్స్, డాని వ్యాట్ హాడ్జ్, ఎల్లీస్ పెర్రీ, అలిస్సా హీలీ తదితరులు ఉన్నారు.
మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్లు వీరే..
* హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్) – 179 మ్యాచ్‌లు
* సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 177 మ్యాచ్‌లు
* డాని వ్యాట్-హాడ్జ్ (ఇంగ్లాండ్) – 175 మ్యాచ్‌లు
* ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా) – 168 మ్యాచ్‌లు
* అలిస్సా హీలీ (ఆస్ట్రేలియా) – 162 మ్యాచ్‌లు
* నిదా దార్ (పాకిస్తాన్) – 160 మ్యాచ్‌లు
* స్మృతి మంధాన (భారతదేశం) – 150 మ్యాచ్‌లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (63), అమన్‌జోత్ కౌర్ (63 నాటౌట్) హాఫ్ సెంచరీలు బాదారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.